AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H-1B Visa : హెచ్‌-1బీ వీసా రుసుముపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి గుడ్‌న్యూస్‌ వీడియో

H-1B Visa : హెచ్‌-1బీ వీసా రుసుముపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి గుడ్‌న్యూస్‌ వీడియో

Samatha J
|

Updated on: Sep 22, 2025 | 1:49 PM

Share

ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టతనిచ్చారు. ఈ రుసుము కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ప్రస్తుత హెచ్-1బీ వీసాదారులకు ఇది వర్తించదని తెలిపారు. అమెరికా బయట ఉన్న వీసాదారులు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయులతో సహా అనేక మంది ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు అమెరికాకు తక్షణం రావాలని మెయిల్స్ పంపించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టీకరణ ఇచ్చారు. లక్ష డాలర్ల రుసుము కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి ఇది వర్తించదని తెలిపారు. ఈ రుసుము వార్షికం కాదు, ఒకేసారి చెల్లించాల్సిన రుసుము అని వివరించారు. ప్రస్తుత వీసాదారులు అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చునని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

కట్టలు కట్టలుగా పాములు..వామ్మో చూస్తేనే వణుకు పుడుతోంది డియో

దసరాకు శూర్పణఖ దహనం..ప్రియుడి కోసం పిల్లలు, భర్తలను చంపిన భార్యల ఫొటోలతో .. – TV9

మళ్లీ అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు వీడియోTV9

 

Published on: Sep 22, 2025 01:38 PM