Save Aravalli: సేవ్ ఆరావళి పేరుతో రోడ్డెక్కిన ప్రజలు

Updated on: Dec 22, 2025 | 7:31 PM

కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వత శ్రేణికి ఇచ్చిన కొత్త నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడంతో రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో "సేవ్ ఆరావళి" నినాదాలు మార్మోగుతున్నాయి. ఈ కొత్త నిర్వచనం మైనింగ్ మాఫియాకు మార్గం సుగమం చేస్తుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వత శ్రేణికి కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం, సుప్రీంకోర్టు దీనిని ఆమోదించడంతో రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ప్రజల నిరసనలు తీవ్రమయ్యాయి. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత “సేవ్ ఆరావళి” నినాదంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. కొత్త నిర్వచనం ప్రకారం, 100 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న పర్వతాలు, 500 మీటర్ల పరిధిలో కనీసం రెండు పర్వతాలు ఉన్నవాటిని మాత్రమే ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తారు. మిగిలిన వాటిని సాధారణ కొండలుగా పరిగణిస్తారు. ఈ మార్పు మైనింగ్ మాఫియాకు లాభం చేకూర్చి, చిన్న కొండలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మహిళలకు భారీ షాక్‌.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Dubai: నదుల్లా మారిన దుబాయ్‌ రోడ్లు..

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..

రెండు నెలల ఆపరేషన్‌ సక్సెస్‌.. బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే