TTD: శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్..బస్సులో వెళ్తే శీఘ్ర ద‌ర్శనం..

|

Aug 12, 2023 | 10:52 PM

తిరుమల శ్రీవారి భక్తులకు ఆర్టీసీ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. తిరుమలకు చేరుకునే వారికి అందించే దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సుల్లో దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ క్రమంలోనే ప్రయాణికులను ఆకర్షించేందుకు మరో సదవకాశాన్ని కల్పించింది ఆర్టీసీ. తాజా మరిన్ని టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నిన్న మొన్నటివరకు రోజూ ఆర్టీసీ ప్రయాణికులకు రాష్ట్రవ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తుండగా.. తాజాగా ఆ సంఖ్యను 1000కు పెంచింది. బస్సు ఛార్జీతో పాటు శ్రీవారి దర్శనానికి 300 దర్శన టికెట్‌ను ప్రయాణికులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బుక్‌ చేసుకునే టికెట్లు ఆగస్ట్ 15 నుంచి అక్టోబరు 7వ తేదీలోపు ప్రయాణం, దర్శనానికి ఉపయోగించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ www.apsrtconline.in లో అదనపు కోటా టికెట్ల బుకింగ్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు ఉంటుంది. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకోవడానికి ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కల్పించింది ఆర్టీసీ. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి దైవ దర్శనానికి వచ్చే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 12, 2023 10:28 PM