ఓర్నాయనో.. ఇక నుంచి వర్షాలే కాదు.. గజగజ వణికించే చలి కూడా.. ఐఎండీ కీలక అప్డేట్‌

Updated on: Nov 10, 2025 | 1:53 PM

మొంథా తుఫాన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు, చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, ఏపీలో 3 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9-14 డిగ్రీల మధ్య నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.

మొంథా తుఫాన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం నుండి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అంతర కర్ణాటక – పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనాన్ని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర – ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు రాయలసీమ, ఉత్తర కోస్తా, యానాంలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఒకటి లేదా రెండుచోట్ల జల్లులు కురిసే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నాయి.. శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో వెదర్ డిపార్ట్మెంట్ మరో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గంజాయి మత్తులో రచ్చ రచ్చ.. డ్రైవర్‌పై దాడి

ఉగ్ర దాడులకు ప్లాన్.. ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్