AP SSC Exams: టెన్త్ పరీక్షల్లో కీలక మార్పు.. ఇప్పుడెలా.? వర్రీ అవుతున్న విద్యార్థులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. పదో తరగతి విద్యార్థులపై ఇది ప్రభావం చూపించబోతోంది. తాజా మార్పులో భాగంగా పదో తరగతి పరీక్ష విధానంలో సమూల మార్పులు చేసింది ఏపీ సర్కార్.
టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలనది తాజాగా తీసుకున్న నిర్ణయం. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్ చొప్పున కేవలం ఆరు పరీక్షలే నిర్వహించనున్నారు. కాగా గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్ చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. అయితే కరోనా నేపథ్యంలో వాటిని ఏడింటికి కుదించారు. అయితే సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..