Rain Alert: రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి.. చెట్లకిందకు వెళ్లొద్దు
నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు మాత్రం వీడటంలేదు. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడటంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వర్షాలు పడే ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు సుమారుగా 26° నుంచి 32°C మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. నైరుతి, ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. తెలంగాణలో 7వ తేదీ వాతావరణం వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 22°C నుంచి 30° మధ్య ఉండవచ్చన్నారు. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: దిగి వచ్చిన పుత్తడి ధర.. నేడు ఎంతంటే
విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు
అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

