రెండు రోజుల పాటు బీ అలర్ట్‌.. చెట్లు, స్తంభాల కింద ఉండొద్దు

Updated on: Nov 07, 2025 | 1:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇటు తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. క్యుములో నింబస్‌ మేఘాలు అలముకున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూపీలో దారుణం.. రైల్వే ట్రాక్ దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు.. ఆరుగురు మృతి

Rain Alert: కొనసాగుతున్న ద్రోణి.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

Gold Price Today: అయ్యో.. బంగారం మళ్లీ పెరిగిందే

AA22: ఏఏ 22 అప్‌డేట్‌.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్