Sankranti Holidays 2025: ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

|

Dec 31, 2024 | 6:06 PM

ఏపీలో సంక్రాంతి సెలవులపై కన్‌ఫ్యూజన్ నెలకొన్న క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 11–15 లేదా జనవరి 12–16 వరకు సెలవులు కుదిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. సెలవులు అధికారిక అకడమిక్ పాఠశాల క్యాలెండర్‌ ప్రకారమే ఉంటాయని ప్రభుత్వం ధృవీకరించింది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సంక్రాంతి వస్తే.. హైదరాబాద్‌లో సగం సిటీ ఖాళీ అవుతుంది. సెటిలర్స్, జాబ్స్ నిమిత్తం నగరంలో ఉండేవారు అంతా సొంత ఊర్లకు వెళ్లిపోతారు. ఆంధ్రాలో ఈ పండుగ తీరే వేరు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు.. పండుగ హాలిడేస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని.. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లోని స్కూళ్లకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటన ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి హాలిడేస్ ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు
2025 సెలవుల లిస్ట్ కూడా ప్రభుత్వం గతంలో విడుదల చేసింది. షెడ్యూల్‌‌లో మొత్తం 23 సాధారణ సెలవులు.. 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నాయి. సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు రెండూ కలుపుకొని మొత్తంగా 44 రోజులు సెలవులు ఉన్నట్టు ఆంధ్రా సర్కార్ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.