AP లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుతో మారబోతున్న సరిహద్దులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం అనే మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మార్పుల వల్ల జిల్లాల సరిహద్దులు గణనీయంగా మారబోతున్నాయి. ముఖ్యంగా, మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ప్రకాశం జిల్లాలో కొండపి, సంతనూతలపాడు వంటి నియోజకవర్గాలు ఉండనున్నాయి. నెల్లూరు, బాపట్ల జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలు ప్రకాశంలోకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పాలనా సౌలభ్యం కోసం కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అవి మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు. ఈ కీలక నిర్ణయంతో రాష్ట్రంలోని జిల్లాల సరిహద్దులు మారనున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ మార్పుల ప్రభావం గణనీయంగా ఉండనుంది. కొత్తగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లా విషయానికి వస్తే, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు, దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ, కురిచేడు మండలాలు స్థానిక డిమాండ్ మేరకు మార్కాపురం జిల్లాలో విలీనం కానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్
Jailer 02: జైలర్ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్
