ఇక.. డబ్బు లేకుండానే గ్యాస్ సిలిండర్లు

Updated on: Jul 23, 2025 | 3:27 PM

ఏపీలోని కూటమి సర్కార్ దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని ముందుగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఆ తరువాతే రాయితీగా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమవుతూ ఉండేది. ఇకపై ఆ విధానం పూర్తిగా మారనుంది.

లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసిన వెంటనే, తగిన రాయితీ మొత్తం ప్రభుత్వమే లబ్ధిదారుల డిజిటల్ వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాలో ముందుగా జమ చేయనుంది. ప్రభుత్వం నుంచి నగదు రాగానే.. లబ్దిదారులకు గ్యాస్ ఏజెంట్లు నేరుగా ఇంటి దగ్గరే సిలెండర్లు అందించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మహిళలకు గొప్ప ఊరట కలగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం అర్హులకు కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తోంది. కానీ రాయితీ జమ కావడంలో ఆలస్యంతో వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తం కావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారో.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ పరిచినట్లే..

నాడు నైట్ వాచ్‌మెన్‌గా జీతం రూ.165… నేడు.. కోట్లు సంపాదిస్తున్న నటుడు

బెంగుళూర్ గుహలో పిల్లలతో రష్యన్ మహిళ.. వివరాల్లోకి వెళ్లగా ఖంగుతిన్న పోలీసులు..