AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..

అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..

Phani CH
|

Updated on: Feb 05, 2026 | 5:29 PM

Share

అనంతపురం నార్పల మండలంలో ప్రజలను భయపెట్టిన "చిరుత దాడి" ఉదంతంపై స్పష్టత వచ్చింది. అటవీ శాఖ అధికారులు క్షుణ్ణంగా గాలించగా, దాడి చేసింది చిరుత పులి కాదని, ఒక అడవి పిల్లేనని తేలింది. ఘటనా స్థలంలో మృతిచెందిన అడవి పిల్లిని కనుగొన్నారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు, అయినప్పటికీ పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల ప్రజలను భయాందోళనకు గురిచేసిన “చిరుత దాడి” ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. ఒక రైతు మరియు మహిళపై దాడి చేసింది చిరుత పులి కాదని, అది ఒక అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బొందలవాడ గ్రామ సమీపంలో ఒక మహిళపై దాడి జరిగిన ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు క్షుణ్ణంగా గాలించారు. ఈ క్రమంలో అక్కడ ఒక అడవి పిల్లి మృతదేహం లభ్యమైంది. నోటి నుంచి రక్తం కక్కుకుని చనిపోయి ఉన్న ఆ అడవి పిల్లిని చూసిన అధికారులు, గతంలో జరిగిన దాడులకు ఇదే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. సాధారణంగా అడవి పిల్లులు మనుషులపై దాడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయని అధికారులు వెల్లడించారు. చనిపోయిన అడవి పిల్లికి అటవీ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అది అనారోగ్యం వల్ల చనిపోయిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఈ నివేదికలో తేలనుంది. దాడి చేసింది చిరుత కాదని, కేవలం అడవి పిల్లి మాత్రమేనని తెలియడంతో నార్పల మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే వణికిపోయిన రైతులకు ఈ వార్త పెద్ద ఊరటనిచ్చింది. అయినప్పటికీ, పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది

రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్

Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్