నల్లని ఒత్తయిన జుట్టు కోసం.. ఇదొక్కటి చాలు

Updated on: Jun 02, 2025 | 6:55 PM

నల్లని, ఒత్తయిన,పొడవాటి జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్‌లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్‌ వాడుతుంటారు. కానీ సహజసిద్ధంగా అందమైన జుట్టు సొంతం చేసుకోడానికి అలోవెరా అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అవును.. కలబంద జుట్టు ఆరోగ్యానికి ఎన్నోరకాలుగా పనిచేస్తుంది. అలోవెరా గుజ్జులో కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేయడం వల్ల.. తల చర్మాన్ని తేమగా ఉంచి జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషణను అందిస్తుంది.

ఈ మిశ్రమాన్ని తరచుగా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదు, కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు తల చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఆముదం నూనెను అలోవెరా గుజ్జుతో కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత సున్నితంగా తలస్నానం చేయాలి. ఇది జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగులో అలోవెరా గుజ్జును కలిపి తలకు అప్లై చేయడం వల్ల తల చర్మం చల్లగా మారుతుంది. పెరుగులో ఉండే ఎంజైమ్‌ లు తల చర్మాన్ని శుభ్రపరిచి జుట్టును మెత్తగా, మృదువుగా ఉంచుతాయి. మెంతులను నానబెట్టి పేస్ట్‌ లా చేసి దానిలో కలబంద గుజ్జు కలిపి తలకు అప్లై చేస్తే.. తల చర్మానికి తేమను అందించడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉసిరి పొడిలో కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించడం వల్ల జుట్టుకు సహజంగా నలుపు రంగు తీసుకురావడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు బలంగా మారుతుంది. కోడిగుడ్డు తెల్ల సొనలో కలబందను కలిపి తలకు అప్లై చేసి కొద్దిసమయం వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రంగా కడగాలి. ఇది జుట్టుకు అవసరమైన ప్రోటీన్‌ ను అందించి జుట్టు పొడవుగా, మెత్తగా మారడానికి సహాయపడుతుంది. గోరింటాకు పొడిని అలోవెరా గుజ్జుతో కలిపి తలకు పట్టిస్తే… జుట్టుకు రంగు ఇవ్వడమే కాకుండా.. జుట్టు బలంగా పెరగడంలో సహాయపడుతుంది. ఈ సహజ మాస్కులు అన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని వారంలో ఒకటి రెండు సార్లు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా, అందంగా ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలానికి వెళ్లిన అతని ఫేట్ తిరిగిపోయింది.. ఒక్కరాయి జీవితాన్నే మార్చేసింది

ఈ పండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదలరు!

బెడ్‌పై నిద్రపోతుండగా.. యువకుడి పైకి పాకుతూ వచ్చిన రాచనాగు.. కట్ చేస్తే

వీరి ధైర్యానికి హ్యాట్సాఫ్‌.. చిరుతలతో కలిసిమెలిసి

Published on: Jun 02, 2025 06:53 PM