గాల్లోనే తెరుచుకున్న ఎమర్జెన్సీ టర్బైన్ వీడియో

Updated on: Oct 05, 2025 | 3:53 PM

అమృత్‌సర్ నుండి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా AI 117 విమానానికి గాల్లో ఉండగా త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా రామ్ ఎయిర్ టర్బైన్ తెరుచుకుంది. పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన సర్వీసును రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అమృత్‌సర్ నుండి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానం AI 117లో గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న క్రమంలో విమానం పవర్ యూనిట్ రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) ఒక్కసారిగా తెరుచుకున్నట్లు సిబ్బంది గుర్తించారు.అయితే, పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్‌ వీడియో

రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో

దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో

ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో