యూరియా బుకింగ్ షురూ.. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అంటే
వ్యవసాయ శాఖ సరికొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది, దీని ద్వారా రైతులు ఇకపై ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎరువుల కృత్రిమ కొరత, క్యూలను తగ్గిస్తుంది. పాస్‌బుక్ లేదా ఆధార్ ద్వారా లాగిన్ అయి, పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియాను పొందవచ్చు. డీలర్ స్టాక్ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి, తద్వారా రైతులు తమకు నచ్చిన డీలర్ నుండి కొనుగోలు చేయవచ్చు.
రైతులు ఇక యూరియా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పని లేదు. రైతు ఇంటి నుంచే మొబైల్‌లో యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. శనివారం నుంచే ఈ యాప్ ను అందుబాటులోకి తెస్తామన్నారు అధికారులు. ఈ క్రమంలో రైతులకు అవగాహన కోసం యాప్‌లో ఏ విధంగా యూరియా బుక్ చేసుకోవాలనే అంశంపై సూచనలు చేశారు. మొబైల్‌లో ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. లాగిన్‌లో మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి. పాస్‌బుక్ నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది. యూరియా బుక్ చేసిన తర్వాత 15 రోజుల్లో 4 దశల్లో యూరియా అందుతుంది. పాస్‌బుక్ లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆఫ్షన్‌లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు. వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతు నేరుగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. ఏయే డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇందుకనుగుణంగా యూరియాను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి యూరియా తీసుకునే అవకాశం లేదు. కృత్రిమ కొరతకు ఆస్కారం ఉండదు. తనకు ఇష్టమైన డీలర్ నుంచి బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఐడీ వస్తుంది. అందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చు. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్.. ఆ తర్వాత
కూలిపోతున్న ఉపగ్రహం.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
టీ20 వరల్డ్‌కప్ 2026.. గిల్‌కు షాక్.. అక్షర్‌కు ప్రమోషన్!
