ప్రకాశం జిల్లా కంభంలో గంజాయి కలకలం రేపింది. గంజాయి కలిగి ఉన్న ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుంచి 450 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం నుంచి గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి కంభం పట్టణంలోని రెడ్డి లాడ్జిలో గంజాయి కలిగి ఉన్న వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాడు. అంతేకాకుండా కంభంలో కొన్ని మెడికల్ షాపులను మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఈబీ, పోలీసులు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. రెండు మెడికల్ షాపుల నుంచి కొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ మెడికల్ షాప్‌లపై చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంధ్య తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలపై విచారణ చేపట్టామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ బాలసుందర్రావు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..