బరువు తగ్గడానికి జిమ్‌లో వర్కౌట్.. 37ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి..షాకింగ్‌ వీడియో

Updated on: Jul 03, 2025 | 12:13 PM

పంకజ్ శర్మ (37) వ్యక్త ఇఅకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. స్నేహితులు సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పంకజ్ 170 కిలోల బరువున్నాడు. బరువు తగ్గేందుకు అతడు గత 4 నెలలుగా రెగ్యూలర్‌గా జిమ్‌కు వెళ్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా జిమ్‌కి వెళ్లిన పంకజ్‌.. వర్కౌట్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలాడు.

హరియాణాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హరిఫరీదాబాద్‌లోని బల్లభ్‌గఢ్‌లోని ఒక జిమ్‌లో వ్యాయామం చేస్తూ 37 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. పంకజ్ శర్మ (37) వ్యక్త ఇఅకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. స్నేహితులు సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పంకజ్ 170 కిలోల బరువున్నాడు. బరువు తగ్గేందుకు అతడు గత 4 నెలలుగా రెగ్యూలర్‌గా జిమ్‌కు వెళ్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా జిమ్‌కి వెళ్లిన పంకజ్‌.. వర్కౌట్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలాడు. అక్కడున్న వారు గమనించి సీపీఆర్‌ చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…