Andhra: పట్టుబడ్డవి యూరియా బస్తాలు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే కళ్లు తేలేస్తారు
అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం బొడ్డురేవులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న 320 కిలోల గంజాయిను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో 16 మంది అరెస్ట్ కాగా.. ఆటో, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా..
చట్టాలు ఎన్ని అమలు చేసినా.. కేటుగాళ్లు యదేచ్చగా తమ దందా కొనసాగిస్తున్నారు. ఇదే యవ్వారం ఇటీవల ఏపీలో జరిగింది. గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని రాష్ట్ర సరిహద్దు దాటించాలని చూడగా.. పోలీసులు కాపుకాసి రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా.. అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. వి.మాడుగుల మండలం బొడ్డురేవులో పోలీసుల తనిఖీల్లో 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటో, మూడు బైక్‌లలో గంజాయి తరలిస్తుండగా 16 మందిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారని, పట్టుబడిన గంజాయి విలువ 16 లక్షలు ఉంటుందన్నారు పోలీసులు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెబుతున్నారు. అరెస్టయిన వారిని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

