Hyderabad: ఓ వీధిలో తేడాగా కనిపించిన అజ్ఞాత వ్యక్తి.. చేతిలో గొనె సంచి.. చెక్ చేయగా

Updated on: Sep 12, 2025 | 8:41 PM

ఓ వ్యక్తి రోడ్డుపై కొంచెం తేడాగా తిరుగుతున్నాడు. చేతిలో ఓ గొనె సంచి.. స్థానికులకు కాస్త అనుమానమొచ్చింది. అతడు ఎవరై ఉంటాడా అని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్.

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని పేట్ బషీరాబాద్ పీ.యస్ ‌పరిధీలో ఒక వ్యక్తి నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ పక్కా సమాచారంతో రామాంతాపూర్ నుంచి గంజాయి తరలిస్తున్నాడని తెలుసుకుని జీడిమెట్ల గ్రామం డెకాథ్లాన్ సమీపంలో రవితేజ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, అతడిపై కేసు నమోచు చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అలాగే గంజాయి సప్లై చేస్తున్న మున్నా అనే మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.