Telangana: బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. అతడి దగ్గరున్న సంచి చెక్ చేయగా.!

|

Apr 23, 2024 | 5:18 PM

నిర్మల్ బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వారిని చూడగానే అతడిలో కంగారు.. తత్తరపాటు కనిపించడంతో.. ఖాకీలు అతడ్ని ఆపి చెక్ చేశారు. అతడి దగ్గర ఉన్న ఓ సంచిని.. విప్పి చూడగా.. ఆ ఖాకీల మైండ్ బ్లాంక్ అయింది. అందులో కనిపించింది చూసి.. దిమ్మతిరిగింది.

ఎన్నికల వేళ గంజాయి ఒక్కసారిగా గుప్పుమంది. తెలంగాణలోని నిర్మల్, బైంసాలలో భారీగా గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కురాన్నపేట బస్టాండ్ వద్ద గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న పట్టణ పోలీసులు.. వారి వద్ద నుంచి రూ. 5 వేలు విలువ చేసే 245 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అటు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి భైంసాకు తరలించి.. పట్టణంలో గంజాయిను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు ఖాకీలు. ఈ ముఠాకు చెందిన మరో 4 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 1.142 కిలోల గంజాయి సీజ్ చేసినట్టు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.