AP News: పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్.. వెతికి చూడగా

|

Jul 17, 2024 | 4:03 PM

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలోని పెద్ద కొండపై 15 అడుగుల భారీ సైజు కొండచిలువ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో కొందరు మేకల కాపర్లు పెద్ద కొండపైకి తమ మేకలను మేపేందుకు తీసుకెళ్లారు. ఇక మేకలు కొండపై మేస్తున్న సమయంలో..

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలోని పెద్ద కొండపై 15 అడుగుల భారీ సైజు కొండచిలువ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో కొందరు మేకల కాపర్లు పెద్ద కొండపైకి తమ మేకలను మేపేందుకు తీసుకెళ్లారు. ఇక మేకలు కొండపై మేస్తున్న సమయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కొంతసేపటికి మందలోని మేకలన్నీ పెద్దగా పెద్దగా అరుస్తూ.. బెదిరిపోతూ.. తలోదిక్కు పరుగులు పెడుతూ కనిపించాయ్. అక్కడే ఉన్న మేకల కాపర్లు అనుమానమొచ్చి కొండపైకి వెళ్లగా.. ఓ భారీ సైజ్ కొండచిలువ మేకను చుట్టుకుని హతమార్చి ఉండడాన్ని గమనించారు. దాన్ని చూడగానే భయభ్రాంతులకు గురైన మేకల కాపర్లు చుట్టుప్రక్కల ఉన్న రైతులను, గ్రామస్తులను సాయం కోసం పిలిచారు. అలాగే వారి సాయంతో ఆ కొండచిలువను కర్రలతో కొట్టి హతమార్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on