AP News: తెల్లారగానే రోడ్డుపై పోలీసుల తనిఖీలు.. ఆటోను ఆపి చెక్ చేయగా కళ్లు బైర్లు.!

ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న కొందరు.. అక్రమ దారులను తొక్కుతూ తప్పుదోవ పడుతున్నారు. ఈ కోవలోనే ఓ ఐదుగురు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో జల్సాలకు అలవాటుపడి.. చివరికి ఊసలు లెక్కపెట్టారు. వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో అక్రమంగా.. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

AP News: తెల్లారగానే రోడ్డుపై పోలీసుల తనిఖీలు.. ఆటోను ఆపి చెక్ చేయగా కళ్లు బైర్లు.!

|

Updated on: Mar 23, 2024 | 11:21 AM

ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న కొందరు.. అక్రమ దారులను తొక్కుతూ తప్పుదోవ పడుతున్నారు. ఈ కోవలోనే ఓ ఐదుగురు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో జల్సాలకు అలవాటుపడి.. చివరికి ఊసలు లెక్కపెట్టారు. వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. గత కొద్దిరోజులుగా పలమనేరు, బైరెడ్డిపల్లి, వికోట ప్రాంతాల్లో యదేచ్చగా అక్రమ గంజాయి దందా కొనసాగుతోంది. దీంతో ఆయా మార్గాల్లో ప్రత్యేక బృందాలు గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం బైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద ఆటోలో తరలిస్తున్న 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఆ ముఠాకు చెందిన ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేశారు.

పలమనేరుకు చెందిన షేక్ సలీం, వెంకటేష్ విశాఖపట్నం, తుని నుంచి గంజాయిని తెప్పించేవారట. అలా తీసుకొచ్చిన గంజాయిని ఆటోలో తీసుకెళ్ళి చిరంజీవి, రెడ్డెప్ప, సుబ్రమణ్యం, పెద్దప్పయ్య, లోకేష్ అనే ఐదుగురు వ్యక్తులకు అందించేవారు. వారంతా చిన్నచిన్న ప్యాకెట్లుగా ఈ గంజాయిని పార్శిల్ చేసి.. పలమనేరు, బైరెడ్డిపల్లె, వికోట గ్రామాల్లోని యువకులకు విక్రయించి లక్షల్లో లాభాలు ఆర్జించేవారట. ఈ విషయాన్ని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. కాగా, ఈ ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి 10 కిలోల గంజాయి, ఒక ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow us