పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. దీపావళికి ‘వకీల్‌ సాబ్’‌ టీజర్‌..!

కరోనా నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు మళ్లీ ప్రారంభం అయ్యాయి. సీనియర్ హీరోలను మినహాయిస్తే మిగిలిన వారు దాదాపుగా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.

  • Manju Sandulo
  • Publish Date - 4:21 pm, Fri, 23 October 20

Pawan Kalyan Vakeel Saab: కరోనా నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు మళ్లీ ప్రారంభం అయ్యాయి. సీనియర్ హీరోలను మినహాయిస్తే మిగిలిన వారు దాదాపుగా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి వకీల్‌ సాబ్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ మూవీ టీజర్‌ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పవన్‌కు సంబంధించి ఇంకా 15 రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. దాన్ని కూడా వచ్చే నెల చివరకు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన పింక్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగెళ్ల, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

Read More:

రాయలసీమ స్టీల్‌ ప్లాంట్ కార్పొరేషన్ రద్దు చేసిన ప్రభుత్వం

ఆగిన విజయ్‌-మురగదాస్.. ఆ రెండింటిలో అసలు కారణం ఏది..!