ట్రంప్ అభిశంసనలో మరో అడుగు, 25 వ సవరణకు మైక్ పెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి సభ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనలో మరో ముందడుగు పడింది, ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన...

  • Umakanth Rao
  • Publish Date - 5:09 pm, Wed, 13 January 21
ట్రంప్ అభిశంసనలో మరో అడుగు,  25 వ సవరణకు మైక్ పెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఉద్దేశించిన  తీర్మానానికి సభ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనలో మరో ముందడుగు పడింది, ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన 25 వ సవరణను ప్రతిపాదించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కోరుతూ ఓ తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు ,వ్యతిరేకంగా 205 ఓట్లు పడ్డాయి. ట్రంప్ కు ఉద్వాసన పలకడానికి ఈ సవరణను ఉపయోగించేందుకు కేబినెట్ ను సమీకరించాలని పెన్స్ ను ఇందులో కోరారు. ఈ ఓటింగ్ లో ఒక రిపబ్లికన్ అనుకూలంగా ఓటు చేయగా, అయిదుగురు గైర్ హాజరయ్యారు.

25 వ సవరణ అంటే ?..దీని ప్రకారం ఉపాధ్యక్షుడు గానీ, కేబినెట్ లో మెజారిటీ సభ్యులు గానీ, కాంగ్రెస్ సూచించిన ఏ సంస్థ అయినా అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఒకవిధంగా  ఆ సమయంలో ఉపాధ్యక్షుడికి సర్వాధికారాలు ఉంటాయి.కానీ ట్రంప్ మాత్రం తన అభిశంసన ప్రక్రియను తేలిగ్గా తీసుకుంటున్నారు. బహుశా చివరి క్షణంలో ఏదైనా అద్భుతం జరిగి తన పదవికి ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నట్టు కనబడుతోంది. అటు స్పీకర్ నాన్సీ పెలోసీ..ఇక ట్రంప్ కి వీడ్కోలు పలకడానికి సమయం ఆసన్నమైందని అంటున్నారు.

Read Also :డొనాల్డ్ ట్రంప్ అభిశంసన కోసం 25 వ సవరణ ప్రతిపాదనకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తిరస్కృతి, యూ టర్న్ తీసుకున్నట్టేనా.