డొనాల్డ్ ట్రంప్ అభిశంసన కోసం 25 వ సవరణ ప్రతిపాదనకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తిరస్కృతి, యూ టర్న్ తీసుకున్నట్టేనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 25 వ సవరణను ప్రతిపాదించే ప్రక్రియను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తిరస్కరించారు..

  • Umakanth Rao
  • Publish Date - 10:47 am, Wed, 13 January 21
డొనాల్డ్ ట్రంప్ అభిశంసన కోసం 25 వ సవరణ ప్రతిపాదనకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తిరస్కృతి, యూ టర్న్ తీసుకున్నట్టేనా

Us Vice President Mike Pence: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 25 వ సవరణను ప్రతిపాదించే ప్రక్రియను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తిరస్కరించారు. ట్రంప్ పదవీ కాలం ముగియడానికి ఇక కేవలం 8 రోజులే ఉన్నాయని,  మీరు, డెమోక్రాట్ సభ్యులు, కేబినెట్ తో బాటు నన్ను కూడా ఈ సవరణను ప్రయోగించాలని కోరుతున్నారని ఆయన హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ దేశం, లేదా రాజ్యాంగ ప్రయోజనాల దృష్ట్యా ఈ విధమైన చర్య మంచిది కాదని తాను భావిస్తున్నానన్నారు.ట్రంప్ అభిశంసనకు ఉద్దేశించిన తీర్మానంపై ప్రతినిధుల సభ ఓటింగ్ చేపట్టడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ  లేఖ రాశారు. మన దేశ పరిస్థితి తీవ్రంగా ఉన్న సమయంలో ఈ సభ రాజకీయ క్రీడలాడానికి చేసే ప్రయత్నాలకు తను లొంగబోనని పెన్స్ అన్నారు. కాగా- ఈయన యూ టర్న్.. ట్రంప్ అభిశంశన ప్రక్రియకు అవరోధంగా మారవచ్చునని పెలోసీ అభిప్రాయపడ్డారు.

అటు ట్రంప్ మాత్రం 25 వ రాజ్యాంగ సవరణ వల్ల తనకు ఎలాంటి ముప్పు లేదని ట్రంప్ ధీమాగా ఉన్నారు.

బీహార్ లో ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ కాల్చివేత, నితీష్ కుమార్ ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు, పోలీసుల దర్యాప్తు ముమ్మరం

కరోనా వ్యాక్సినేషన్‌కు చురుకుగా ఏర్పాట్లు.. మొదటి విడతలో ప్రజాప్రతినిధులకు అవకాశమివ్వండి.. ప్రధానికి పాండిచ్చేరి సీఎం లేఖ

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 24మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం..!