Breaking News
  • హైదరాబాద్‌: బేగంపేటలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి. ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో రక్తపు మడుగులో ఉన్న మృతదేహం. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
  • నిర్మల్‌: బైంసాలో కంది రైతుల అరిగోస. ఎలాంటి సమాచారం లేకుండా కొనుగోళ్లను నిలిపివేసిన అధికారులు. ఈరోజు తేదీతో టోకెన్‌ ఇచ్చిన అధికారులు. కొనుగోలు కేంద్రానికి కందులు తీసుకొచ్చిన రైతులు. కొనుగోళ్లు లేకపోవడంతో కందులను తిరిగి తీసుకెళ్తున్న రైతులు.
  • హైదరాబాద్‌: నేరెడ్‌మెట్‌లో దారుణం. మైనర్‌ బాలికపై ఫోటోగ్రాఫర్‌ అఘాయిత్యం ఫోటోకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై సలీం అత్యాచారం. అరుచుకుంటూ స్టూడియో బయటికి పరుగులు తీసిన బాలిక. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక.
  • నెల్లూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. పలు శాఖలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేస్తున్న అధికారులు.
  • భద్రాచలం సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్యాయత్నం. బాత్‌రూమ్‌ రేకుతో చేయి కోసుకున్న ప్రవీణ్‌కుమార్‌. ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు.
  • డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌. యాదాద్రి భువనగిరిజిల్లాః భువనగిరిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. ప్రియుడి మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 16న ప్రేమ వివాహం చేసుకున్న స్వామి, ఉమారాణి. వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందినవారిగా గుర్తింపు.

కాంగ్రెస్ ఘోర పరాజయం.. రాజ్‌బబ్బర్ రాజీనామా

Raj Babbar, కాంగ్రెస్ ఘోర పరాజయం.. రాజ్‌బబ్బర్ రాజీనామా

గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్.. క్రమేపి తగ్గుతూ.. ఈ ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, నటుడు రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు.

కాగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించింది. కేవలం రాయ్‌బరేలిలో మాత్రమే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విజయం సాధించారు. మరోవైపు ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రాజ్ బబ్బర్, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ చహార్ చేతిలో ఓడిపోయారు.

Related Tags