దేశంలో మరో 75 మెడికల్ కాలేజీలు: కేంద్ర మంత్రి జవదేకర్

దేశంలో కొత్తగా మరో 75 మెడికల్ కళాశాలలకు లైన్ క్లియర్ అయ్యింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 2021-22లోగా కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా మొత్తం 15,700 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. ఇదే విషయాన్ని ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. దేశంలో ఇప్పటివరకు మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో ఈ కళాశాలలు నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. అదే విధంగా దేశంలో చెరకు […]

దేశంలో మరో 75 మెడికల్ కాలేజీలు: కేంద్ర మంత్రి జవదేకర్
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 7:54 PM

దేశంలో కొత్తగా మరో 75 మెడికల్ కళాశాలలకు లైన్ క్లియర్ అయ్యింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 2021-22లోగా కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా మొత్తం 15,700 ఎంబీబీఎస్ సీట్లు రానున్నాయి. ఇదే విషయాన్ని ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. దేశంలో ఇప్పటివరకు మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో ఈ కళాశాలలు నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. అదే విధంగా దేశంలో చెరకు రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని, రూ.6 వేల కోట్ల ఎగుమతి రాయితీ ఇవ్వనున్నట్టుగా చెప్పారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల రైతులకు లబ్ది చేకూరనుందని జవదేకర్ తెలిపారు.