Breaking News
  • పెళ్లికి రెడీ అంటున్న రానా. తన తండ్రి, బాబాయి వెంకటేష్ తో ఫోటో షేర్ చేసిన రానా. ఈరోజు రమానాయుడు స్టూడియో లో రానా మిహికల వివాహం. పెద్దల అంగీకారంతో రానా మిహికల ప్రేమ వివాహం. కారోనా నిబంధనల నేపధ్యంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన నిశ్చితార్థం. పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులు 35 మంది మాత్రమే హాజరు కానున్నారు. VR కీట్స్ ద్వారా దగ్గరి బంధువులకు పెళ్ళి చూసేందుకు ఏర్పాటు. వధువు మిహిక ఇంట నిన్న జరిగిన మెహింది కార్యక్రమం. సంప్రదాయం ప్రకారం నిన్న రానాని పెళ్ళికొడుకుని చేసిన కుటుంబసభ్యులు. కోవిడ్ టెస్టులు చేపించుకున్న వధూవరుల కుటుంబ సభ్యులు.
  • కడపజిల్లాలో విషాదం. నాన్న చనిపోయాడని బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న అక్క చెల్లెళ్లు. కమలాపురం మండలం యార్రగుడిపాడు గ్రాంమం వద్ద ఘటన. డి. శ్వేత 26 వివాహిత, డి .సాయి 20 ప్రొద్దుటూరు ఇంజనీరింగ్ చదువుచున్నది. వీరి తండ్రి ప్రొద్దుటూరు వై ఎం ఆర్ కాలనీలోని బాబురెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్.. నిన్నటిఆయన అనారోగ్యంతో మరణించారు. నాన్న మృతదేహం హాస్పిటల్లో లో ఉండగా ఆ బాధ తట్టుకోలేక తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఉదయం 6 గంటలకు ముందు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
  • ఢిల్లీ నుంచి బయలుదేరిన రెండు ప్రత్యేక విమానాలు. విమానాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈవో, ఎయిరిండియా సిఎండి, DGCA దర్యాప్తు బృందం, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు. ముంబై నుంచి మరో విమానంలో విచారణకు సహకరించే ఇతర అధికారుల బృందం.
  • అనంతపురం కన్సెప్ట్ సిటీ కన్సల్టెంట్ గా CBRE సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ . భవిష్యత్ వ్యాపార అవసరాల కోసం రాష్ట్రం లో 3 కాన్సెప్ట్ సిటీలు ప్లాన్ చేసిన సర్కార్ . అనంతపురం కాన్సెప్ట్ సిటీకి కాన్సెప్టువల్ ప్లాన్, ఫీజబిలిటి రిపోర్ట్, బిజినెస్ స్ట్రాటజీ, ఫైనాన్సియల్ మోడల్ ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయనున్న CBRE. ఇందుకోసం దాదాపు 85 లక్షల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు.
  • తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం. కోయిఅంబత్తూర్ లోని ఆనకట్ట రహదారిలో చెట్టుని డీ కొట్టిన కారు . కారులో ప్రయాణిస్తున్న యువకులలో నలుగురు మృతి , ఒకరి పరిస్థితి విషమం . కారు అతివేగం గా నడపడం ప్రమాదానికి కారణం . ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుకలు వెళ్లివస్తుండగా జరిగిన ఘటన.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ : 5,90,306. ఈ ఒక్కరోజే టెస్టింగ్స్: 23,322. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 2256. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 77,513. జిహెచ్ఎంసి లో ఈరోజు కేసులు: 464. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 42 189. కరోనా తో ఈరోజు మరణాలు : 14. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 615. చికిత్స పొందుతున్న కేసులు : 22,568. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 1091. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 54,330.
  • అర్ధరాత్రి సమయంలో మరోసారి కడప సెంట్రల్ జైలుకు చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్ ను దురుసుగా మాట్లాడిన వ్యవహారంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించిన గుత్తి కోర్టు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు.. పోలీస్ బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైలుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్ది..
  • కేరళలో జరిగిన ప్లేన్ యాక్సిడెంట్ గురించి విని షాక్ కి గురయ్యాను. మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను. - అల్లు అర్జున్ ట్వీట్.

క్వారంటైన్‌లోకి కేంద్రమంత్రి.. కారణం ఇదే..

కరోనా మహమ్మారి యావత్ ప్రంపచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దాటికి సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజా ప్రతినిధుల వరకు అంతా వణికిపోతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌ బీజేపీ చీఫ్ రవీరందర్..
Union minister in quarantine after meeting BJP J-K chief who tested Corona Positive, క్వారంటైన్‌లోకి కేంద్రమంత్రి.. కారణం ఇదే..

కరోనా మహమ్మారి యావత్ ప్రంపచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దాటికి సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజా ప్రతినిధుల వరకు అంతా వణికిపోతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌ బీజేపీ చీఫ్ రవీరందర్ రైనాకి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. దీంతో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ నెల 12వ తేదీన కేంద్రమంత్రి.. జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్‌తో భేటీ అయ్యారు. అయితే ఆయనకు మంగళవారం నాడు పాజిటివ్‌ అని తేలడంతో.. వెంటనే మంగళవారం సాయంత్రం 4.00 గంటల నుంచి హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ఆయన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, కరోనా పాజిటివ్‌గా తేలిన రైనా.. ప్రస్తుతం రియాసి జిల్లా కక్రయాల్‌లోని శ్రీ మాత వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందితున్నారు.

అయితే తాను గత వారం.. బందిపొరాలో బీజేపీ నేతకు చెందిన అంత్యక్రియల్లో పాల్గొన్నానని తెలిపారు. ఆ తర్వాత.. మంగళవారం ఉదయం కొద్దిపాటి జ్వరం వచ్చిందని.. దీంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలిందని తెలిపారు.

 

MoS PMO Jitendra Singh goes into self-quarantine after J&K BJP President Ravindra Raina tested positive for #COVID19 with whom he had come in contact. pic.twitter.com/mz5js3ucXM

— ANI (@ANI) July 14, 2020

Related Tags