Breaking News
  • పోల్‌ సమరం : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ . దుబ్బాక సహా దేశవ్యాప్తంగా 56 అసెంబ్లీ నియోజవర్గాలకు ఉప ఎన్నికలు . మధ్యప్రదేశ్‌లో పార్టీ మారి రాజీనామా చేసిన ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు . గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ మారి.. రాజీనామా చేసిన ఎమ్మెల్యే స్థానాలకు షెడ్యూల్‌ విడుదల . అక్టోబర్‌ 9న ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ . నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్‌ 16 . నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 19 . నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 11న ఫలితాలు . మణిపూర్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో నవంబర్‌ 3న పోలింగ్‌. మణిపూర్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ .
  • మోదీ పర్యటన : ఉత్తరాఖండ్‌లో ఆరు మెగా ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. ఇంటింటికి మంచీనీరందించే లక్ష్యంతో జల్‌జీవన్‌ మిషన్‌ లోగో ఆవిష్కరణ. రైతు సంక్షేమంమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మోదీ . బ్లాక్‌ మనీ కోసమే విపక్షాలు రాజీయీఆలు చేస్తున్నాయి . రైతులు పూజించే యంత్రాలకు నిప్పంటించి అవమానిస్తున్నారు . స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేస్తున్నామన్న మోదీ .
  • కరోనా వారియర్స్‌: తూ.గో: కరోనాను జయించిన ఎస్పీ అద్నన్‌ నయీం అస్మీ, ఏఎస్పీ కరణం కుమార్‌. విధుల్లో చేరేందుకు వచ్చిన వీరిపై సిబ్బంది పూలవర్షం . ఘనస్వాగతం పలికిన తోటి పోలీసులు.
  • ఉప ఎన్నికలకు పచ్చజెండా : ఢిల్లీ: కర్నాటకలో ఉప ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌. 2 కౌన్సిల్‌, 2 ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ . అక్టోబర్‌ 28న పోలింగ్‌, నవంబర్‌ 2న కౌంటింగ్‌ . గత జూన్‌ 30న ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు .
  • విశాఖ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన దీక్ష, పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకే మోదీ చట్టాన్ని తీసుకొచ్చారని నారాయణ విమర్శలు.
  • ప్రచారంలో వాస్తవంలేదు . ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడి పేరును లోకేష్‌ వ్యతిరేకిస్తున్నా ప్రచారంలో నిజంలేదు. అవి కేవలం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే-టీడీపీ వర్గాలు .
  • బతుకమ్మ చీరల ప్రదర్శన : హైదరాబాద్‌: హరితప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శన. ప్రదర్శనను తిలకిస్తున్న మంత్రులు కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌ . మరికాసేపట్లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం .
  • వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం. ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది, అక్టోబర్‌ 15 నుంచి ధ్యాసపెట్టాలి. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలి. ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు పూర్తి చేయాలి. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి, సోషల్‌ ఆడిట్‌ చేయాలి, మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలి. ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదు, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలి.

భారీ ధ‌ర‌కు అమ్ముడైన‌ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ శాటిలైట్ రైట్స్ !

సత్యదేవ్..తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కుంటూ ఓ ప్ర‌త్యేక శైలిని ఏర్ప‌రుచుకున్నాడు. అత‌డు ఎన్నుకునే క‌థ‌లు చాలా భిన్నంగా ఉంటాయి.

uma maheswara ugra roopasya Rights Bagged By ETV, భారీ ధ‌ర‌కు అమ్ముడైన‌  ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ శాటిలైట్ రైట్స్ !

Uma Maheswara Ugraroopasya  : సత్యదేవ్..తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌కుంటూ ఓ ప్ర‌త్యేక శైలిని ఏర్ప‌రుచుకున్నాడు. అత‌డు ఎన్నుకునే క‌థ‌లు చాలా భిన్నంగా ఉంటాయి. తాజాగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చేశాడు స‌త్యదేవ్. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మంచి పాజిటివ్ బ‌జ్ తెచ్చుకుంది. వీక్ష‌కుల నుంచి మంచి రివ్యూస్ వ‌స్తున్నాయి. చిత్రంలోని ఉమా మహేశ్వర రావు పాత్రలో సత్యదేవ్ జీవించాడ‌ని అంద‌రూ కొనియాడుతున్నారు. డిజిటల్‌లో భారీగా వ్యూస్‌‌ను రాబడుతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా శాటిలైట్‌ రైట్స్ మంచి ధ‌ర‌కు అమ్ముడ‌య్యాయి. కొత్త సినిమా శాటిలైట్‌ రైట్స్ కొనే విషయంలో స‌హ‌జంగా మా టీవీ, జీ తెలుగు, జెమినీ టీవీ వంటి ఛానల్స్ పోటి పడి కొంటాయి. కానీ ఈసారి భిన్నంగా ఈ సినిమాను కొనేందుకు ఈటీవీ ఇంట్ర‌స్ట్ చూపించింది. ఈ టీవీ యాజమాన్యం ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను దాదాపు 2.5 కోట్లకు కొన్నట్లుగా సమాచారం. అంతేకాదు అతి త్వరలోనే ఈ మూవీ ఈటీవీలో ప్రసారం అవ్వ‌నుంద‌ట‌. కాగా ఈ చిత్ర‌ మొత్తం బడ్జెట్ కూడా రెండు కోట్లు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తెర‌కెక్కింది. అక్కడ లీడ్ రోల్‌లో ఫాహిద్ ఫాజిల్ నటించాడు. ఇక ఈ సినిమాను తెలుగులో ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయణ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేశాడు. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో పోషించ‌గా.. ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్‌ నరేష్, సుహాస్‌, జబర్థస్త్‌ రామ్‌ ప్రసాద్‌ క‌నిపించారు.

 

Read More : ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మ‌న‌సు : గాయ‌ప‌డ్డ వ్య‌క్తికి రోడ్డుపైనే ప్రాథ‌మిక‌ వైద్యం

Related Tags