బ్రిటన్ స్ట్రెయిన్ డిసెంబరుకన్నా ముందే ఇండియాలో ఎంటరైంది, ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, అప్రమత్తత అవసరం

బ్రిటన్ మ్యుటెంట్ కరోనా వైరస్ డిసెంబరు కన్నా ముందే ఇండియాలో ఎంటరయిందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. సెప్టెంబరులో యూకేలో..

బ్రిటన్ స్ట్రెయిన్ డిసెంబరుకన్నా ముందే ఇండియాలో ఎంటరైంది, ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, అప్రమత్తత అవసరం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 31, 2020 | 10:20 AM

బ్రిటన్ మ్యుటెంట్ కరోనా వైరస్ డిసెంబరు కన్నా ముందే ఇండియాలో ఎంటరయిందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. సెప్టెంబరులో యూకేలో ఇది కనిపించిందని, కానీ ఈ వైరస్ నవంబరులో మనదేశంలో ప్రవేశించిందన్నారు. అంటే ఆ దేశం నుంచి మన ఇండియాలోకి, చేరినవారిద్వారా ఇది ఎంటరై ఉండవచ్ఛు..అయితే ఖఛ్చితంగా డేటాను మనం చెప్పలేం అన్నారాయన. నవంబరు నుంచే మన దేశంలో సార్స్-కొవ్-2 జీనోవిక్ కన్సార్షియా ఈ వైరస్ శాంపిల్స్ ని అధ్యయనం చేస్తూ వచ్చిందన్నారు. అప్పటినుంచే యూకే నుంచి ఇండియాకు, ఇండియా నుంచి ఆ దేశానికి ప్రయాణికుల రాకపోకలు జరుగుతూ వచ్చాయని అన్నారు. హాలండ్ డేటాను బట్టి చూస్తే బ్రిటన్ లో కన్నా మునుపే ఈ స్ట్రెయిన్ గురించి ప్రస్తావించినట్టు గులేరియా చెప్పారు.

ఇది చాలా ఇన్ఫెక్షియస్ అని, ఆందోళన కలిగించేదే అని చెబుతూనే ఆయన..కేసుల సంఖ్యపై ఇది పెద్దగా ప్రభావం చూపనప్పటికీ అప్రమత్తత మాత్రం ఇదివరకటి కన్నా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియాలో ఇది  వేగంగా వ్యాప్తి చెందకుండా చూడాల్సి ఉందని హెచ్ఛరించారు. కరోనా వైరస్ కొన్ని మార్పులకు, వివిధ స్థాయిల్లో మ్యుటేషన్లకు లోనవుతుంటుందని, ఈ కొత్త స్ట్రెయిన్ పై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని గులేరియా పేర్కొన్నారు.