ఎండల్లో నోరూ ఎండుకు పోతుంటుంది. చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది మజ్జిగ. ఇది ఉష్ణతాపాన్ని తగ్గించడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాల్నీ పొందొచ్చు
TV9 Telugu
ముఖ్యంగా వేసవిలో మజ్జిగ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మజ్జిగలో జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడే ప్రోబయోటిక్స్ ఉంటాయి
TV9 Telugu
మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి. బరువును తగ్గించడానికీ ఇది బాగా ఉపకరిస్తుంది
TV9 Telugu
పెద్దగ్లాసు మజ్జిగలో 50-80 కెలరీలు మాత్రమే ఉంటాయి. దీనికితోడు నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఫలితంగా చాలాసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది
TV9 Telugu
ఖాళీ కడుపుతో లేదా తిన్న తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇక జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇంగువ కూడా బలేగా సహాయపడుతుంది. అయితే మజ్జిగలో ఇంగువ కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరమని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
మజ్జిగలో ఇంగువ కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. మజ్జిగలో చిటికెడు ఇంగువ కలిపి తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
ఇంగువ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగలో ఇంగువ వేసి తాగవచ్చు. ఇంగువలో శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
ఇంగువ శరీరంలో మంటను తగ్గిస్తుంది. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా దీర్ఘకాల వ్యాధులకు మందులు తీసుకునేవారు మజ్జిగలో ఇంగువ కలిపి తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది