వేడి వేడి పాలల్లో కుంకుమపువ్వు కలిపి తాగితే.. బండి షెడ్డుకే!
17 April 2025
TV9 Telugu
TV9 Telugu
సుగంధ ద్రవ్యాల్లో రారాణిగా భావించే కుంకుమపువ్వు అత్యంత విలువైంది. చాలా ఖరీదైంది కూడా. మిఠాయిల్లో కుంకుమపువ్వు వేస్తే రుచి అదిరిపోతుంది. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తుంది
TV9 Telugu
కుంకుమపువ్వు పూలవాసన, కస్తూరి పరిమళంతో కొంచెం తియ్యగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. తెలిసీ తెలియనట్టుగా కాస్తంత చేదు కూడా ఉంటుంది. దీనిలో కెలొరీలు విస్తారంగా ఉండటమే కాదు, పీచు, ప్రొటీన్లు, సి-విటమిన్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి
TV9 Telugu
కుంకుమపువ్వు కలిపిన పాలు ఆరోగ్యకరమైనవి. ఇందులో ఔషధ గుణాలు, పాల పోషకాలు కలగలిసి ఉంటాయి. దీని కారణంగా ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి లోపలి నుంచి బలం, దృఢత్వాన్ని కూడా ఇస్తుంది
TV9 Telugu
కుంకుమ పువ్వు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకే తరచుగా దీనిని పాలలో కలుపుకుని తాగుతారు. కానీ వేసవిలో కుంకుమపువ్వు పాలు తాగాలా వద్దా అనే సందేహం చాలా మందికి ఉంటుంది
TV9 Telugu
వేసవిలో జలుబు, దగ్గు ఉన్నవారు కుంకుమపువ్వు పాలు తప్పనిసరిగా తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే కుంకుమపువ్వును ఎల్లప్పుడూ చల్లని పాలలో మాత్రమే కలపాలని నిపుణులు అంటున్నారు. వేసవిలో వేడి పాలతో కుంకుమపువ్వు కలిపి తాగడం వల్ల అసిడిటీ సమస్య వస్తుందట
TV9 Telugu
కొంతమంది రాత్రిపూట పాలు జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే కొంతమంది దీనిని ఉదయం తాగడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో మీ శరీర స్వభావాన్ని బట్టి పాలు తాగే సమయాన్ని మీరు ఎంచుకోవచ్చు
TV9 Telugu
చల్లని పాలతో కుంకుమపువ్వు కలిపి తీసుకుంటే చర్మం మెరుస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇది మెదడుకు కూడా మంచిది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది
TV9 Telugu
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు వేడి పాలతో కుంకుమపువ్వు కలిపి తాగితే శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. దీని కారణంగా వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి