ప్రయాణికురాలి పట్ల ఉబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన..!

ఒక మహిళ పట్ల ఉబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఏసీ గాలి అంత చల్లగా లేదని అడిగినందుకు.. వేడిగా ఉంటే తన ఒళ్ళో వచ్చి కూర్చో అంటూ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. ఢిల్లీకి చెందిన అమ్రితా డి అనే  మహిళకు ఈ సంఘటన ఎదురైంది. ఇక తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. ‘ముందుగా అతను ఏసీ వేయడానికి నిరాకరించాడు. అనంతరం ఏసీ వేసినా చల్లగా లేకపోవడంతో ఉక్కపోతగా ఉందని అడిగాను.. దానితో […]

ప్రయాణికురాలి పట్ల ఉబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన..!
Follow us

|

Updated on: Mar 20, 2019 | 5:38 PM

ఒక మహిళ పట్ల ఉబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఏసీ గాలి అంత చల్లగా లేదని అడిగినందుకు.. వేడిగా ఉంటే తన ఒళ్ళో వచ్చి కూర్చో అంటూ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. ఢిల్లీకి చెందిన అమ్రితా డి అనే  మహిళకు ఈ సంఘటన ఎదురైంది. ఇక తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. ‘ముందుగా అతను ఏసీ వేయడానికి నిరాకరించాడు. అనంతరం ఏసీ వేసినా చల్లగా లేకపోవడంతో ఉక్కపోతగా ఉందని అడిగాను.. దానితో అతను ‘అంత ఉక్కపోత గా ఉంటే నా ఒళ్ళో వచ్చి కూర్చో’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు. గమ్యస్థానం రాకముందే నన్ను దించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. ఆ సమయంలో నాతో పాటు నా భర్త కూడా ఉన్నారని’ ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా ఈ ట్వీట్ కు ఢిల్లీ పోలీసులను, ఉబర్ ను ట్యాగ్ చేసింది. అంతేకాదు ఆమె ప్రయాణించిన కార్ ఫొటోస్ ను, డ్రైవర్ ఫొటోస్ ను కూడా జత చేసింది. మరోవైపు దీనిపై ఉబర్ స్పందించి ‘ ఇలాంటి సంఘటనకు మేము చాలా బాధపడుతున్నాం. మా టీం మీకు ఈమెయిల్ ద్వారా బదులిచ్చింది. ఇంకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి’. అని పేర్కొంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో