మీ వెహికల్ వర్షపు వరదనీటిలో కొట్టుకుపోయి పాడైందా..అయితే మేమున్నాం

భాగ్యనగరవాసుల్ని ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో ఒక ఉపశమనాన్నిచ్చే వార్త ఇది. వరద నీటి కారణంగా పాడైన వాహనాలకు ఉచితంగా మరమ్మత్తులు చేస్తామని ప్రముఖ వాహనతయారీ కంపెనీ టీవీఎస్ ప్రకటించింది. కస్టమర్లే తమకు మొదటి ప్రాధాన్యత అని తెలిపిన ఆ కంపెనీ.. వరదలతో నష్టపోయిన వారికి ఉచిత రిపేర్ సర్వీస్‌ను అందజేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా అక్టోబరు 29 నుంచి నవంబరు 4 వరకు ఫ్రీ సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపింది. […]

  • Venkata Narayana
  • Publish Date - 10:15 pm, Fri, 30 October 20

భాగ్యనగరవాసుల్ని ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో ఒక ఉపశమనాన్నిచ్చే వార్త ఇది. వరద నీటి కారణంగా పాడైన వాహనాలకు ఉచితంగా మరమ్మత్తులు చేస్తామని ప్రముఖ వాహనతయారీ కంపెనీ టీవీఎస్ ప్రకటించింది. కస్టమర్లే తమకు మొదటి ప్రాధాన్యత అని తెలిపిన ఆ కంపెనీ.. వరదలతో నష్టపోయిన వారికి ఉచిత రిపేర్ సర్వీస్‌ను అందజేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా అక్టోబరు 29 నుంచి నవంబరు 4 వరకు ఫ్రీ సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ లేనప్పటికీ బైకులకు ఎలాంటి లేబర్ చార్జీ లేకుండా మరమ్మతులు చేయనున్నారు. ఉచితంగా విహికల్ చెకప్ చేసి అవసరమైన రిపేర్ చేస్తారు. ఐతే విడిభాగాలు, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ చార్జీలను మాత్రం వసూలు చేస్తారు. అంతేకాదు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను త్వరగా క్లియర్ చేసేందుకు గాను పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో టీవీఎస్ ఒప్పందం కూడా చేసుకుంది. అయితే, వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన బైక్‌లను ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయవద్దని సూచిస్తోంది. లేదంటే ఇంజిన్ దెబ్బతినే అవకాశముందని చెబుతోంది. మరింత సమాచారం కోసం 7337009958, 9121177261 లేదా Surabhi.udas@tvsmotor.com, Priyanka.b@tvsmotor.com సంప్రదించాలని వెల్లడించింది.