క్యాబ్, టీవీ9 ఎడ్యుకేషనల్ సమ్మిట్.. భారీ స్పందన

Tv9 kab Education Summit Ends Today, క్యాబ్, టీవీ9 ఎడ్యుకేషనల్ సమ్మిట్.. భారీ స్పందన

హైదరాబాద్‌లో క్యాబ్ సమ్మిట్ ఆహ్లాదభరితంగా సాగుతోంది. టీవీ9, క్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోన్న ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోకు విశేష స్పందన వస్తోంది. ఇవాళ ఆఖరి రోజు కావడంతో జనం పోటెత్తుతున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ సమ్మిట్‌కి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ సమ్మిట్‌లో బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీకి చెందిన ప్రముఖ విద్యాసంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 100కి పైగా స్టాల్స్‌ను ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేశారు నిర్వాహకులు. విద్యార్ధులు, వారి తల్లిదంద్రులకు ఉన్నత విద్యకు సంబంధించిన సకల సమాచారాన్ని అందిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ ఇలా ఉన్నతవిద్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తున్నారు. కోర్సులకు, ఉద్యోగాలకు సంబంధించి సలహాలు అందిస్తున్నారు. ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *