జయసుధకు అపూర్వ సత్కారం..!

TSR Abhinaya Mayuri Award to Actress Jayasudha, జయసుధకు అపూర్వ సత్కారం..!

సహజనటి జయసుధను అభినయ మయూరి అవార్డుతో సత్కరిస్తోంది టి. సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్. ప్రతియేట తన పుట్టినరోజున ఎంతోమంది ప్రఖ్యాత కళాకారులను, ఆధ్యాత్మిక వేత్తలను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరిస్తుంటారు. దీనిని ఒక ఆనవాతీగా భావిస్తూ ఎన్నో ఏళ్లుగా ఈ వేడుకలను ఆద్యంతం అద్భుతంగా నిర్వహిస్తున్న సుబ్బిరామిరెడ్డి జన్మదినం అంటే.. సాహిత్య, ఆథ్యాత్మిక, కళారంగాలకు ఒక పండుగే. సెప్టెంబర్ 16న విశాఖలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే జయసుధకు అవార్డు ప్రధానంతో పాటు సర్వధర్మ సంభావన సమ్మేళనాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. విశాఖ కళా వాహిని ఆడిటోరియంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తలు హాజరయ్యారు. 46 ఏళ్లుగా సీనీరంగ ప్రస్థానంలో విలక్షణ నటనా వైదుష్యంతో విఖ్యాత నటీమణిగా ఖ్యాతిగాంచిన డాక్టర్. జయసుధకు అభినయ మయూరి అనే విశిష్టమైన బిరుదును ప్రధానం చేసి సుబ్బిరామి రెడ్డి సత్కరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *