బాగ్దాదీని ‘ చంపిన ‘ శునకాన్ని ట్రంప్ ‘ గౌరవించాడిలా ‘ !

ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికన్ దళాలు అంతమొందించిన తీరులో ప్రధాన పాత్ర పోషించిన శునకాన్ని అధ్యక్షుడు ట్రంప్ వెరైటీగా ‘ గౌరవించారు ‘. 2017… వియత్నాంలో జరిగిన యుధ్ధంలో 10 మంది తమ దేశ సానికులను రక్షించిన నాటి జేమ్స్ మెక్ క్లౌగన్ ని ఆయన మెడల్ తో సత్కరించాడు. మాజీ సైనికాధికారి అయిన జేమ్స్ సాహసాన్ని ట్రంప్ ఎంతో ప్రశంసించాడు. అయితే తాజాగా నాడు జేమ్స్ ని సత్కరించిన ఫోటో స్థానే ఈ జాగిలం ఫోటోని […]

బాగ్దాదీని ' చంపిన ' శునకాన్ని ట్రంప్ ' గౌరవించాడిలా ' !
Follow us

|

Updated on: Oct 31, 2019 | 12:15 PM

ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికన్ దళాలు అంతమొందించిన తీరులో ప్రధాన పాత్ర పోషించిన శునకాన్ని అధ్యక్షుడు ట్రంప్ వెరైటీగా ‘ గౌరవించారు ‘. 2017… వియత్నాంలో జరిగిన యుధ్ధంలో 10 మంది తమ దేశ సానికులను రక్షించిన నాటి జేమ్స్ మెక్ క్లౌగన్ ని ఆయన మెడల్ తో సత్కరించాడు. మాజీ సైనికాధికారి అయిన జేమ్స్ సాహసాన్ని ట్రంప్ ఎంతో ప్రశంసించాడు. అయితే తాజాగా నాడు జేమ్స్ ని సత్కరించిన ఫోటో స్థానే ఈ జాగిలం ఫోటోని రీప్లేస్ చేయడం విశేషం. ఇది ‘ అమెరికన్ హీరో ‘ అని తన ట్విట్టర్లో అభివర్ణించాడు. సిరియాలో బాగ్దాదీని ఓ సొరంగంలోకి తరిమి అతని చావుకు కారణమైన ఈ జీవి కూడా సాహసిక జీవే అని పేర్కొన్నాడు. పైగా నాటి మెడల్ లోని స్టార్ గుర్తును ఓ ‘ పా ప్రింట్ ‘ తో మార్చాడు కూడా. అయితే ఇంత జరిగినా ఈ శునకం పేరును ట్రంప్ గానీ, పెంటగన్ గానీ బహిర్గతం చేయకపోవడం విడ్డూరం. గత సోమవారం ట్రంప్ ఈ కుక్క ఫోటోని ట్వీట్ చేయగానే అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. దాని ఫీచర్ తో లక్షలాది మేంలు వెల్లువెత్తాయి.

కాగా-ప్రస్తుతం 73 ఏళ్ళ వయసున్న మెక్ క్లౌగన్.. ట్రంప్ తాజా చర్యపై ఇంకా స్పందించలేదు. అటు-మార్చిన ఫోటో అసలు జేమ్స్ దేనా అంటూ రకరకాలుగా వఛ్చిన ఈ-మెయిల్స్ ని ‘ డైలీ వైర్ ‘ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెరెమీ బోరింగ్ కొట్టిపారేశాడు. మరోవైపు బాగ్దాదీ హతమవుతుండగా ఈ శునకం చేసిన పోరాట పటిమను జేమ్స్ ప్రశంసించాడు. న్యూయార్క్ టైమ్స్ తో మాట్లాడిన ఆయన.. నిజంగా ఇది అమెరికన్ హీరోనే అని కొనియాడాడు. వియత్నాంలో 1969 లో ఆ దేశ సైనిక బలగాలకు, తమ దళాలకు మధ్య జరిగిన యుధ్ధంలో గాయపడిన జేమ్స్.. తన గాయాలను లెక్క చేయకుండా పలువురు అమెరికన్ సోల్జర్లను రక్షించాడు. ఇందుకు గాను 2017 లో ట్రంప్ ఈయనను మెడల్ తో సత్కరించాడు.