Viral: ఆమె ఏడిస్తే కన్నీరుకు బదులుగా రక్తం.. ఆశ్చర్యపోతున్న డాక్టర్లు.. కారణం..?

కొలంబియాకు చెందిన 17 ఏళ్ల యువతి ఓ వింత వ్యాధితో పోరాడుతోంది. ఆమె ఏడ్చినప్పుడు, కన్నీళ్లకు బదులుగా, ఆమె కళ్ళ నుండి రక్తపు ధార వస్తుంది. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. క్యూర్ ఏంటి అన్నది చెప్పలేకపోతున్నారు. తనకు సమాజం నుంచి సరైన మద్దతు రావడం లేదని ఆ యువతి వాపోతుంది. ఈ అరుదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసకుందాం పదండి..

Viral: ఆమె ఏడిస్తే కన్నీరుకు బదులుగా రక్తం.. ఆశ్చర్యపోతున్న డాక్టర్లు.. కారణం..?
Red Eye (Image Credit: www.marca.com)

Updated on: Aug 02, 2023 | 5:22 PM

‘నీతో రక్త కన్నీరు పెట్టిస్తా..’, ‘నేను నిన్ను రక్త కన్నీరు పెట్టేవరకు వదిలిపెట్టను…’ ఇలాంటి డైలాగ్స్‌ పాత తెలుగు సినిమాల్లో అప్పట్లో వినిపించేవి. కానీ ఇలా నిజంగానే జరుగుతుందా…? మనిషి కళ్ల నుంచి కన్నీరు కాకుండా రక్త వస్తుందా..? అవును.. కొలంబియాకు చెందిన 17 ఏళ్ల యువతి వ్యధ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బారన్‌క్విల్లా ప్రాంతంలో నివాసం ఉండే జారిక్ రామిరేజ్ అటువంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీని కారణంగా ఆమె ఏడుస్తున్నప్పుడు, కన్నీళ్లకు బదులుగా, ఆమె కళ్ళ నుండి రక్తం వస్తుంది. వెబ్‌సైట్ మార్కాలో ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం, జారిక్ ఇప్పుడు తన అసాధారణ పరిస్థితి గురించి ప్రపంచం మొత్తానికి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ అరుదైన వ్యాధి నుంచి బయట పడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల నుంచి ఆమె సాయం కోరుతున్నారు. మూడేళ్ల క్రితం 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు, తాను ఈ వింత వ్యాధి బారిన పడ్డానని ఆమె తెలిపారు. తొలుత ముక్కు నుండి రక్తం రావడం మొదలైంది.  ఆ తర్వాతి కాలంలో కళ్ల నుంచి రక్తం వచ్చేది. ఇప్పుడు నోటి నుంచి కూడా రక్తం కారడం మొదలైంది.

డాక్టర్ ఏమన్నారు?

నేత్ర వైద్య నిపుణుడు లూయిస్ ఎస్కాఫ్ ఈ అరుదైన వ్యాధిని ‘వికారియస్ మెన్స్ట్రుయేషన్’ అంటారని తెలిపారు. దీని కారణంగా గర్భాశయం నుంచి కాకుండా, ముక్కు, చెవులు, చనుమొనలు, కడుపు, కాళ్ళు, తల నుండి కూడా పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అవుతుందని వెల్లడించారు. మార్చి 2020 నుండి తన జీవితం పూర్తిగా మారిపోయిందని జారిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ నిపుణుడు తన సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయాడని ఆమె తెలిపారు. డాక్టర్లు నా సమస్యపై రీసెర్చ్ చేశారు. నేను శారీరకంగా పూర్తిగా బాగున్నాను. న్యూరాన్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ… సమస్య ఏంటో అంతుచిక్కడం లేదని పేర్కొన్నారు.

బ్యాడ్ లక్ ఏంటి అంటే, జారిక్‌కు తగిన మద్దతు లభించడం లేదు. ఆమె ఆత్మన్యూనతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. సమాజం ఆమె బాధను అర్థం చేసుకోలేకపోతుంది.  ఈ సమస్య కారణంగా తన చదువును వదిలివేయవలసి వచ్చిందని ఆమె వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..