Viral: అదృష్టమంటే ఈ లక్కీ ఫెలో‌దే.. జాక్‌పాట్ ఎంత వచ్చిందో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సింది మనం

అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ ట్రక్ డ్రైవర్‌ను అదృష్టం వరించింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా 32 వేల డాలర్ల బహుమతి దక్కింది. కెనో మానిటర్‌లో తన టికెట్ నెంబర్ చూసినప్పుడు నమ్మశక్యం కలగలేదని సదరు ట్రక్ డ్రైవర్ చెప్పాడు. బాల్టిమోర్‌కు చెందిన..

Viral: అదృష్టమంటే ఈ లక్కీ ఫెలో‌దే.. జాక్‌పాట్ ఎంత వచ్చిందో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సింది మనం
Representative Image

Updated on: Jun 14, 2024 | 12:30 PM

అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ ట్రక్ డ్రైవర్‌ను అదృష్టం వరించింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా 32 వేల డాలర్ల బహుమతి దక్కింది. కెనో మానిటర్‌లో తన టికెట్ నెంబర్ చూసినప్పుడు నమ్మశక్యం కలగలేదని సదరు ట్రక్ డ్రైవర్ చెప్పాడు. బాల్టిమోర్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌కు మేరీలాండ్ వైపు వెళ్లినపుడు ఓ బార్‌లో ఆగడం, మద్యం సేవించి సేదతీరడం అలవాటు. ఆ సమయంలో కెనో లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు.

అయితే, ఎప్పుడూ పది డాలర్లు మాత్రమే దీనికోసం వెచ్చిస్తాడు. ఈ నెల 5న మాత్రం పది డాలర్ల కెనో టికెట్ అడిగితే బార్ టెండర్ అదనంగా 40 డాలర్ల బోనస్ టికెట్‌ను ఇచ్చింది. దానిని కొంటారా లేక వాపస్ చేస్తారా అని అడగగా ట్రక్ డ్రైవర్ తన తప్పని పరిస్థితుల్లో మిగిలిన 30 డాలర్లు ఇచ్చి ఆ టిక్కెట్ కొన్నాడు.

ఫలితాల రోజు కెనో.. మీటర్ చూసుకుంటే వరుసగా తన టికెట్ నెంబర్ పైనున్న అంకెలు కనబడడంతో ఆశ్చర్యపోయాడు. మొత్తం పది అంకెలలో వరుసగా తొమ్మిది అంకెలు సరిపోవడంతో ట్రక్ డ్రైవర్ కొన్న టికెట్‌కు 32 వేల డాలర్ల లాటరీ తగిలింది. ఈ మొత్తం మన రూపాయల్లో 26 లక్షలకు పైమాటే. అనుకోకుండా కొన్న 40 డాలర్ల టికెట్ వల్ల ఆ ట్రక్ డ్రైవర్ 32 వేల డాలర్లు గెల్చుకున్నాడు. ఈ మొత్తాన్ని పొదుపు చేసుకుంటానని సదరు డ్రైవర్ చెప్పాడు.

ఇది చదవండి: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి