ఆ వ్యక్తిపై పగబట్టిన కాకులు?

| Edited By:

Sep 02, 2019 | 4:37 AM

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా బదర్‌వాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో పనిచేసే ఒక యువకుడిని మూడేళ్లుగా కాకులు వెంటాడుతున్నాయి. వివరాల్లోకి వెళితే సుమైలా గ్రామానికి చెందిన శివ ఇంటి నుంచి బయటకు రాగానే అతనిని కాకులు చుట్టుముడుతూ దాడికి దిగుతున్నాయి. దీంతో అతను బయటకు వచ్చినప్పుడల్లా ఒక కర్ర తీసుకుని తిరుగుతుంటాడు. ఈ సందర్భంగా బాధితుడు శివ మాట్లాడుతూ తాను మూడేళ్ల క్రితం తన గ్రామంలోని ఒక తోట మీదుగా వస్తుండగా, ఒక కాకిపిల్ల పొదల్లో చిక్కుకుని […]

ఆ వ్యక్తిపై పగబట్టిన కాకులు?
Follow us on

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా బదర్‌వాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో పనిచేసే ఒక యువకుడిని మూడేళ్లుగా కాకులు వెంటాడుతున్నాయి. వివరాల్లోకి వెళితే సుమైలా గ్రామానికి చెందిన శివ ఇంటి నుంచి బయటకు రాగానే అతనిని కాకులు చుట్టుముడుతూ దాడికి దిగుతున్నాయి. దీంతో అతను బయటకు వచ్చినప్పుడల్లా ఒక కర్ర తీసుకుని తిరుగుతుంటాడు. ఈ సందర్భంగా బాధితుడు శివ మాట్లాడుతూ తాను మూడేళ్ల క్రితం తన గ్రామంలోని ఒక తోట మీదుగా వస్తుండగా, ఒక కాకిపిల్ల పొదల్లో చిక్కుకుని కనిపించిందని తెలిపాడు. దానిని కాపాడే ప్రయత్నంలో అది చనిపోయిందనన్నాడు. ఆ తరువాత నుంచి తనకు రోడ్డు మీద నడవడం కష్టంగా మారిందన్నాడు. మొదట్లో కాకులు దాడి చేస్తుంటే అర్థంకాలేదని, తరువాత తాను చేసిన పని గుర్తుకు వచ్చిందని తెలిపాడు. తన చేతిలో కాకిపిల్ల చనిపోయన కారణంగానే తాను కాకులకు శత్రువును అయినట్టున్నానని పేర్కొన్నాడు. కాగా కాకులకు మిగిలిన పక్షల కన్నా గ్రహణశక్తి అధికంగా ఉంటుదని, ఇవి తమకు ఎవరు శత్రువులో, మిత్రులో ఇట్టే గ్రహిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటి గుడ్లకు, పిల్లలకు ఎవరైనా హాని తలపెడితే అవి వెంటనే దాడి చేస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.