
యువతలో రోజురోజుకూ రీల్స్ పిచ్చి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు ప్రాణాలను సైతం పనంగా పెడుతున్నారు. చివరకు అవి బెడిసికొట్టి పోలీస్ స్టేషన్‌లో ఊసలు లెక్కిస్తున్నారు. ఇలాంటి ఘటన తరచూ ఎన్ని జరుగుతున్నా.. వారి తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. రోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో యవకుడు సైతం ఇలానే రీల్స్ పిచ్చితో స్టంట్స్ చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై అజయ్ రాజ్బర్ అనే యువకుడు ప్రమాదకరంగా రీల్స్ చేశాడు. ట్రైన్ వస్తుండగా ట్రాక్‌పై పడుకునే ట్రైన్ తనపై నుంచి వెళ్తున్న దృశ్యాలను తన ఫోన్‌తో మరో స్నేహితుడితో రికార్డ్ చేయించాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారి రైల్వే శాఖ అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి చేరింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, యువకుడి అకౌంట్ ద్వారా అతని అడ్రస్ కనిపెట్టి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే నిబంధనలకు విరుద్దంగా పట్టాలపై ప్రమాదకర రీల్స్ చేసినందుకు గాను యువకుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇలా నిబంధనలకు విదరుద్దంగా ఎవరైనా రీల్స్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుదామని.. వీడియో తీస్తే అది కాస్తా.. అతన్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేయడంతో యువకుడు కంగుతిన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి