Scary Video: భారీ పాముతో మెట్రో ప్రయాణం.. అధికారులపై మండిపడుతున్న నెటిజన్లు..

|

Jul 30, 2023 | 4:00 PM

Shocking Video: ప్రస్తుతం నెట్టింట ఓ వైవిధ్యమైన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఉన్నది కూడా ఓ పెంపుడు ప్రాణే కానీ అది కుక్క, పిల్లి కాదు.. పక్షులు అసలేకావు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు పాముతో మెట్రో ప్రయాణం చేస్తున్నారు. చదవడానికి నమ్మశక్యం కాకపోయినా వీడియో చూస్తే నమ్మకతప్పని పరిస్థితి అని మీరే ఒప్పుకుంటారు. వీడియో చూడకుండా ఫోటో చూసి బొమ్మ పాము..

Scary Video: భారీ పాముతో మెట్రో ప్రయాణం.. అధికారులపై మండిపడుతున్న నెటిజన్లు..
Youngster With Pet Snake
Follow us on

Scary Video: పెంపుడు జంతువులను ఇష్టపడనివారు ఉండరు. వీధిలో కుక్కను తరిమికొట్టినా ఇంట్లో పెంపుడు జంతువుకు ముద్దులు పెట్టే సమాజం మనది. ఇక ఈ పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ వైవిధ్యమైన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఉన్నది కూడా ఓ పెంపుడు ప్రాణే కానీ అది కుక్క, పిల్లి కాదు.. పక్షులు అసలేకావు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు పాముతో మెట్రో ప్రయాణం చేస్తున్నారు. చదవడానికి నమ్మశక్యం కాకపోయినా వీడియో చూస్తే నమ్మకతప్పని పరిస్థితి అని మీరే ఒప్పుకుంటారు. వీడియో చూడకుండా ఫోటో చూసి బొమ్మ పాము అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే..

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి భారీ సైజులో ఉన్న తన పెంపుడు పామును మెడలో వేసుకుని మెట్రో రైలులో నిలుచుకున్నాడు. అయితే అదేం పెద్ద విశేషం కాదన్నట్లుగా ఆ మెట్రోలోని తోటి ప్రయాణికులు తమ తమ ఫోనుల్లో నిమగ్నులైపోయారు. unilad అనే ఇన్‌స్టా ఐడీ నుంచి 5 రోజుల క్రితం షేర్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకు 14 వేల లైకులు, 10 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో..


ఇదిలా ఉండగా వీడియోను చూసిన నెటిజన్లు సదరు యువకుడిపై, ఇంకా అతన్ని మెట్రోలోకి అనుమతించిన అధికారులపై మండిపడుతున్నారు. తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి చేష్టలు చేయడం సరికాదని ఆ యువకుడిని ఉద్దేశించి చెబుతున్నారు. ఇంకా అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని భారీగా ఫైన్ వేయాలని, అధికారులకు ఫిర్యాదు చేయకుండా కూర్చున్న తోటి ప్రయాణికులు కూడా శిక్షార్హులేనని తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంకా పాములు లేదా ఇతర ప్రాణాంతక జీవులను పెంచుకునేవారు వాటిని తమ ఇంట్లోనే పెట్టుకోవాలి కానీ ఇలా పబ్లిక్‌లోకి తీసుకురాకుడదని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..