సాధారణంగా చాలా మంది కుక్కలను, చిలుకలను, కుందేళ్లను, ఆవులను పెంచుకుంటారు. కానీ, ఒక్క వ్యక్తికి కొండచిలువలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు, అత్యంత ప్రమాదకరమైన కొండచిలువపై కూర్చుని దానికి కితకితలు కూడా పెడుతున్నాడు. ప్రేమగా దాని నోటిని తడుముతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూస్తున్న వారికి మాత్రం హార్ట్‌బీట్ అమాంతంగా పెరిగిపోతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ కొండచిలువ అతన్ని అమాంతంగా మింగేస్తుందని, అందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తోందని ఒకరు రాయగా, పాముతో స్నేహం చేసిన వ్యక్తి ఆ పాము కాటుకే బలికాక తప్పదని మరొకరు అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏది ఏమైనప్పటికీ వైరల్ వీడియో కనిపించిన వ్యక్తి మాత్రం భారీ కొండచిలువతో తను స్నేహం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకే అతను దానికి కితకితలు పెడుతున్నప్పుడు అతని నెమ్మదిగా కదిలింది తప్ప దానికి ఎలాంటి కోపం రాలేదు. అతడు దానితో ఆడుకుంటాడు, దానితో కలిసి పడుకుంటాడు, దానిపై కూర్చున్నాడు, దాని నోటిలో చేయి పెట్టాడు. దాని తలను కూడా ప్రేమగా నిమురుతున్నాడు. అయితే, ఈ యువకుడికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజంగానే వీడియో చూస్తున్న వాళ్లకు స్పృహ తప్పుతోంది. ఈ వీడియోని కోట్లాది సార్లు వీక్షించారు. కొండచిలువను అంతగా నమ్మడం సరికాదని, ఏ క్షణమైన ఎదురుతిరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. మీ స్నేహం ఖర్చుతో కూడుకున్నది అంటూ మరొకరు వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..