Viral Video: విమానమెక్కిన యువతికి ఊహించని షాక్.. బ్యాగ్ చెక్ చేయాలన్న సిబ్బంది.. భయపడుతూ వెళ్లగా..

|

Jul 04, 2022 | 8:52 PM

అప్పుడే ఓ యువతి విమానమెక్కింది. తన సీట్‌ నెంబర్ వెతుకుతూ వెళ్తోంది. ఈలోపు ఆమెను విమానంలోని క్యాబిన్ సిబ్బంది పిలిచారు...

Viral Video: విమానమెక్కిన యువతికి ఊహించని షాక్.. బ్యాగ్ చెక్ చేయాలన్న సిబ్బంది.. భయపడుతూ వెళ్లగా..
Viral Video
Follow us on

అప్పుడే ఓ యువతి విమానమెక్కింది. తన సీట్‌ నెంబర్ వెతుకుతూ వెళ్తోంది. ఈలోపు ఆమెను విమానంలోని క్యాబిన్ సిబ్బంది పిలిచారు. ‘మీ బ్యాగ్‌లో డ్రగ్స్ ఉన్నాయని సమాచారం వచ్చింది.ఒక్కసారి చెక్ చేయాలని’ పేర్కొన్నారు. అంతే! దెబ్బకు సదరు యువతి భయపడిపోయింది. భయం భయంగానే వారి వద్దకు వెళ్లి బ్యాగ్‌లోని అన్ని వస్తువులు చూపిస్తోంది. సీన్ కట్ చేస్తే..

తాము ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసేందుకు వినూత్న రీతిలో సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు అబ్బాయిలు. కొందరు అయితే భిన్నంగా తమలోని ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి.. తన ప్రియురాలిని అదిరిపోయే రీతిలో సర్‌ప్రైజ్ చేశాడు. అతడిచ్చిన ట్విస్ట్‌కు ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ వీడియో పాతదైనప్పటికీ.. మరోసారి వైరల్ అవుతోంది.

మనురాజ్ అనే వ్యక్తి.. తన ప్రియురాలితో కలిసి ఫ్లైట్ ఎక్కాడు. అయితే ఆమెకు అది తెలియనివ్వలేదు. సరిగ్గా విమానం 30 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. అతడు క్యాబిన్ సిబ్బందితో కలిసి ఓ ప్రాంక్ ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే.. ఆమెను చెక్ చేయాలని విమాన సిబ్బంది పిలిచింది. ‘మీ బ్యాగ్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని సమాచారం వచ్చింది’ అంటూ ఆ యువతి బ్యాగ్ చెక్ చేయడం మొదలుపెట్టారు. ఆమె కూడా భయపడుతూ అన్ని చూపించింది. అయితే ఇంతలో ఆమె తన పక్కనే పూల బోకే పట్టుకుని నిలబడటం చూసింది. అంతే! ‌హమ్మయ్య.. అనుకుంటే వెళ్లి ఠక్కున సీట్‌లో కూర్చుంటుంది. అనంతరం మనురాజ్ తన ప్రియురాలికి మోకాళ్ళ మీద నిలబడి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.