Viral Video: కదులుతున్న మెట్రో ట్రైన్ నుంచి బయటకి దూకాడు.. ఆ తర్వాత.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

|

Jul 29, 2022 | 9:58 PM

సాధారణంగా వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం అనుక్షణం అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే ప్రమాదం ఏ క్షణం నుంచి దూసుకొస్తుందో చెప్పడం చాలా కష్టం. అంతే గానీ ప్రమాదాన్ని కోరి తెచ్చకుంటామా.. అలా ఎవరూ కోరకోరు. ఎందుకంటే అది...

Viral Video: కదులుతున్న మెట్రో ట్రైన్ నుంచి బయటకి దూకాడు.. ఆ తర్వాత.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jumping From Train
Follow us on

సాధారణంగా వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం అనుక్షణం అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే ప్రమాదం ఏ క్షణం నుంచి దూసుకొస్తుందో చెప్పడం చాలా కష్టం. అంతే గానీ ప్రమాదాన్ని కోరి తెచ్చకుంటామా.. అలా ఎవరూ కోరకోరు. ఎందుకంటే అది తెలివితక్కువ పనే కాకుండా ప్రాణాతంకం కూడా. అయితే కొంత మంది మాత్రం అలా ప్రమాదాలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న వీడియో కూడా ఇలాంటి ప్రమాదకరమైనదే. ఇందులో ఒక వ్యక్తి కదులుతున్న మెట్రో రైలు నుంచి దూకేస్తాడు. అయితే మెట్రోలో (Metro Train) ప్లాట్‌ఫారం పై రైలు ఆగినప్పుడు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. కానీ ఈ యువకుడు మాత్రం తలుపును బలవంతంగా తీసి స్టేషన్ ప్లాట్ ఫాం పై దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ యువకుడు మెట్రో నుంచి దూకగానే అతడు చాలా వేగంగా ప్లాట్ ఫాం పై పడిపోవడాన్ని మనం చూడవచ్చు.

వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది అతనిని లేపి, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అతని ఎముకలు విరిగిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల అతనికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 5 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి