Viral Video: పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగిస్తుండగా స్టేజ్‌ మీదకెళ్లిన చిచ్చర పిడుగు.. ఆ తర్వాత ఏమైందంటే..

|

Aug 19, 2022 | 6:30 PM

క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ నిర్వహించే వీక్లీ ఆడియన్స్‌ కార్యక్రమంలో ఓ ఇటాలియన్‌ పిల్లాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. పోప్‌ తన సందేశాన్ని ఇస్తున్న సమయంలో హఠాత్తుగా..

Viral Video: పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగిస్తుండగా స్టేజ్‌ మీదకెళ్లిన చిచ్చర పిడుగు.. ఆ తర్వాత ఏమైందంటే..
Pope Francis
Follow us on

Little boy joins Pope Francis on stage, Viral Video: క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ నిర్వహించే వీక్లీ ఆడియన్స్‌ కార్యక్రమంలో ఓ ఇటాలియన్‌ పిల్లాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. పోప్‌ తన సందేశాన్ని ఇస్తున్న సమయంలో హఠాత్తుగా స్టేజ్‌ మీదకు వెళ్లాడు. ఐతే ఏ మాత్రం బెరుకు, బెదురు లేకుండా పోప్‌ దగ్గరికి వెళ్లిన పిల్లాడితో పోప్ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే..

రోమ్‌లోని వాటికన్‌ సిటీలోనున్న క్యాథలిక్‌ చర్చి మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ తన సందేశాన్ని వినిపిస్తున్న సమయంలో ఓ చిన్నపిల్లవాడు స్టేజ్‌ మీదకు నడుచుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. నేరుగా పోప్‌ దగ్గరికి వెళ్లి సైలెంట్‌గా ఉంటాడు. పోప్ ఫ్రాన్సిస్ పిల్లవాడి తలను ఆప్యాయంగా నిమురుతూ, సరదాగా పిల్లాడితో మాటలు కలుపుతాడు. ‘హే.. హౌ ఆర్‌ యు? నీ పేరు ఏమిటి? నీకు ఇక్కడ ఉండటం ఇష్టమా? కంఫర్టబుల్‌గా ఉండు..అని ఇటాలియన్‌ పిల్లాడిని అడగడం ఈ వీడియోలో చూడొచ్చు. మనం పెద్దలు, యువత మధ్య సంభాషణ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈ పిల్లాడికి ధైర్యం ఎక్కువేనని పోప్‌ అనడం కనిపిస్తుంది. చిన్న పిల్లాడితో పోప్‌ ఇంటరాక్షన్‌కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. లక్షల్లో వీక్షణలు, వేలల్లో కామెంట్లతో ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

‘గాడ్ బ్లెస్ పోప్ ఫ్రాన్సిస్! లీడర్లు, అమాయకమైన పిల్లలను ఎలా దగ్గరకు తీసకుంటారో తెలుస్తోంది! పోప్ తనను కౌగలించుకున్న విధానం ఆ చిన్న పిల్లవాడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఇదొక ఐకానిక్ టీచింగ్ మూమెంట్’ అని ఒకరు, ‘వాట్‌ ఏ కామ్‌ బాయ్‌! పిల్లాడి కామ్‌నెస్‌ ముచ్చటగా ఉందని’ మరొకరు.. ఇలా పలువురు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలు తెలిపారు. కాగా ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలోని పాల్ 6 హాల్‌లో పోప్‌ తన సందేశాన్నిచ్చారు. వృద్ధులతో యువకులు నడుచుకోవల్సిన విధానం, వారితో కలిగి ఉండవల్సిన సంబంధం గురించి మాట్లాడుతున్న క్రమంలో సందర్భానికి తగినట్లుగా పిల్లవాడు స్టేజ్‌ మీదకు వెళ్లడం, వారిరువురు మాట్లాడుకోవడం ఆధ్యాంతం ప్రేక్షకులు ఆసక్తి కరంగా తిలకించారు.