భారతదేశంలోని ఏదైనా మెట్రోపాలిటన్ నగరాల్లో మీ కారును పార్క్ చేయడానికి చాలా కష్టమైన పని. ఒకవైపు ఇరుకు గదులు, పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నా కూడా సరైన పార్కింగ్ దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. సరైన స్థలం లేనివాళ్లు ఖర్చు చేసి పార్కింగ్ కు స్థలం కొంటున్నారు. అయితే పార్కింగ్ కోసమే అయితే నెలకు 500, 100 రూపాయలు కట్టొచ్చు. కానీ గంటకు రూ.1000 చెల్లించాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే. అవును బెంగళూరు సిటీలో గంటలకు వెయ్యి రూపాయల చొప్పున పార్కింగ్ కోసం ఖర్చు పెడుతున్నారు కొందరు.
సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ షాక్స్ అవుతున్నారు. బెంగళూరులోని యూబీ సిటీ మాల్ ప్రీమియం పార్కింగ్ కోసం గంటకు రూ.1,000 వసూలు చేస్తోంది. ప్రీమియం పార్కింగ్ ఇక్కడి వాహనదారులు వెయ్యి రూపాయలు పే చేస్తున్నారు. ఒకవేళ పే చేయకపోతే అక్కడి సిబ్బంది వెంటనే అలర్ట్ అవుతారు కూడా. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో సైన్ బోర్డుపై పార్కింగ్ ఛార్జీలు ఉండటం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ వార్త వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
వెయ్యి రూపాలయలు పే చేస్తే.. ప్రీమియం పార్కింగ్ లో కారుకు స్నానం చేయిస్తారా అని ఫన్నీగా బదులిచ్చారు. అంతరిక్ష నౌకలకు పార్కింగ్ స్థలాలు ఇవ్వండి..’ అని మరో నెటిజన్స్ స్పందించాడు. అయితే జాగ్వార్, ఫెరారీ యజమానుల ప్రీమియం కార్ల యజమానులకు పార్కింగ్ స్థలాలను పరోక్షంగా రిజర్వ్ చేయడం, ఇతరులు స్థలాన్ని తీసుకోకుండా ఇలా పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారట.
Premium parking 😏
What does that do? Provide parking lots for space ships? https://t.co/fvamsnqNZn— Vinayak Mohan (@Vinayakmohan) March 5, 2024