Veg Thali Viral: సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటాయి. ”10 శాతం డిస్కౌంట్” అని ఒకరు ఆఫర్ పెడితే.. ”బిర్యానీ కొంటే కూల్ డ్రింక్ ఉచితం” అని మరొకరు అంటారు… ఇలా హోటల్ యజమానులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటారు. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం ఏకంగా ఓ అడుగు ముందుకేసి ఏకంగా రెండు లక్షలు ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో కస్టమర్లు.. ఆ రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..
భోజన ప్రియులకు ఢిల్లీలోని `కుటుంబ్ రెస్టారెంట్’ నిర్వాహకులు ఆహ్వానంతో పాటు ఓ సవాల్ కూడా విసురుతున్నారు. అదే జంబో శాఖాహార థాలీ. ఈ థాలీని 30 నిమిషాల్లో తిన్నవారికి.. అక్షరాలా రూ. 2 లక్షలు అందిస్తామని చెబుతున్నారు. ఆసక్తి కలిగినవారు ఈ థాలీ సవాల్‌ను స్వీకరించేందుకు రోహిణి, లేదంటే గురుగ్రామ్‌లో ఉన్న తమ రెస్టారెంట్ ఔట్‌లెట్స్ దగ్గరకు రావొచ్చని తెలిపారు.
ఇక మొన్నటికి మొన్న.. మహారాష్ట్రలోని పుణె శివారున ఉన్న శివరాజ్ అనే రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షించే క్రమంలో వినూత్న ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ రెస్టారెంట్‌లో భోజనం చేసిన వారికి బుల్లెట్ వాహనాన్ని ఉచితంగా అందిస్తామని ప్రకటన ఇచ్చింది. దీంతో చాలామంది క్యూ కట్టి జంబో థాలీ తినగా.. చివరి పోటీలో మాత్రం ఓడిపోయారు.
Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..