విచిత్ర వార్త అంటే ఇదే.. ఈ జింక చేసిన పని తెలిస్తే..!

వార్త.. విచిత్ర వార్త.. రెండింటికి మధ్య ఢిఫరెన్స్ ఏంటో తెలుసు కదా.. మనిషిని కుక్క కరిస్తే.. వార్త.. కానీ అదే కుక్కను మనిషి కరిస్తే.. విచిత్ర వార్త. అలానే అల్ప జీవుల్ని క్రూర మృగాలు, మనుషులు చంపడం సాధారణమే. మరి ఆ అల్ప జీవులు.. మనుషులను, క్రూర మృగాలను చంపితే.. ఊహించడానికే వింతగా ఉంటుంది. కానీ ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. సాధారణంగా జింకను వేటగాడు చంపటం కామన్. కానీ.. వేటగాడ్ని జింకను చంపటం..? ఇది […]

విచిత్ర వార్త అంటే ఇదే.. ఈ జింక చేసిన పని తెలిస్తే..!

Edited By:

Updated on: Oct 27, 2019 | 5:45 AM

వార్త.. విచిత్ర వార్త.. రెండింటికి మధ్య ఢిఫరెన్స్ ఏంటో తెలుసు కదా.. మనిషిని కుక్క కరిస్తే.. వార్త.. కానీ అదే కుక్కను మనిషి కరిస్తే.. విచిత్ర వార్త. అలానే అల్ప జీవుల్ని క్రూర మృగాలు, మనుషులు చంపడం సాధారణమే. మరి ఆ అల్ప జీవులు.. మనుషులను, క్రూర మృగాలను చంపితే.. ఊహించడానికే వింతగా ఉంటుంది. కానీ ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. సాధారణంగా జింకను వేటగాడు చంపటం కామన్. కానీ.. వేటగాడ్ని జింకను చంపటం..? ఇది చరిత్రలో ఇప్పుటి వరకు ఎప్పుడైనా విన్నారా..? అసలు ఇలాంటి వార్త విన్న దాఖలాలే లేవు. కానీ.. ఎవరూ అనుకోని.. ఊహించని సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. అమెరికాలో జరిగిన ఈ ఉదంతం వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ వేటగాడి చావుపై.. వాడికి తగిన శిక్ష పడిందంటూ సోషల్ మీడియా తిట్టిపోస్తోంది. అయితే అసలు కథేంటంటే..

ఆర్కాన్సస్ రాష్ట్రానికి చెందిన థామస్ అలెగ్జాండర్(66)కు జంతువుల్ని వేటాడే అలవాటు ఉంది. ముఖ్యంగా జింకల్ని వేటాడటం అలవాటుగా చేసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఒజార్క్ కొండ ప్రాంతంలో జింకల వేటకు వెళ్లిన అతడికి.. ఓ కొమ్ముల జింక కంటపడింది. దీంతో అదను చూసి దెబ్బకొడదామనుకొని.. ఆ జింకను ఫాలో అయ్యాడు. అయితే ఆ జింక ఒ దగ్గర ఆగడంతో.. దానిపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ జింక కుప్పకూలిపోయింది.

అయితే.. ఆ జింక మరణించిందనుకున్న థామస్.. జింకను తీసుకొచ్చేందుకు దాని వద్దకు చేరుకున్నాడు. ఇక జింకను ఎత్తుకొవచ్చేనేలోగా.. ఊహించనిరీతిలో ఆ జింక థామస్ మీద విరుచుకుపడింది. దాని వాడి కొమ్ములతో థామస్ మీద పడి దాడి చేయసాగింది. దీంతో థామస్ అక్కడికక్కడే మరణించాడు. అల్ప జీవి అనుకొని.. దాడి చేసేద్దాం అనుకుని.. గురిపెట్టాడు. కానీ ఆ జింక శక్తిని గ్రహించడంలో విఫలమయ్యాడు. చివరకు తన ప్రాణాల్నే కోల్పోయాడు. సో ఈ జరిగిన సంఘటనను చూస్తే తెలిసిందేంటంటే.. ఎవర్నీ తక్కువ అంచనా వేయోద్దని.

Follow Us