Watch: ప్రపంచంలోనే అతి చిన్న కుక్క, అతిపెద్ద కుక్క కలుసుకున్న వేళ.. ఏం జరిగిందంటే..

పెరల్ రెగీని చూడగానే దాంతో స్నేహంగా మెలగటం మొదలుపెట్టింది. రెగీ యజమాని సామ్ జాన్సన్ రేస్ మాట్లాడుతూ, పెరల్ ఎలాంటి భయం, బెరుకు లేకుండా తిరగటం చూసి వారంతా ఆశ్చర్యపోయామని అన్నారు. ఈ ప్రత్యేకమైన సమావేశంతో ఆ రెండు కుక్కల యజమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

Watch: ప్రపంచంలోనే అతి చిన్న కుక్క, అతిపెద్ద కుక్క కలుసుకున్న వేళ.. ఏం జరిగిందంటే..
World's tallest and smallest dogs

Updated on: May 06, 2025 | 3:56 PM

ప్రపంచంలోనే అతి చిన్న కుక్కను మీరు ఎప్పుడైనా చూశారా..? అలాగే, ప్రపంచంలోనే ఎత్తైన కుక్క కూడా ఉంది. ఆ రెండు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి..అలాంటి ఘటన ఇక్కడ కూడా జరిగింది. 3 అడుగుల 4 అంగుళాల పొడవున్న 7 ఏళ్ల గ్రేట్ డేన్ రెగీ, కేవలం 3.59 అంగుళాల పొడవున్న 4 ఏళ్ల చివావా పెరల్ ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. వాటి ఎత్తులలో తేడా వారికి ఎలాంటి అడ్డంకిని కలిగించలేదు. కలిసిన వెంటనే ఆ రెండు మంచి ఫ్రెండ్స్‌ అయ్యాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఆ రెండు కుక్కలు ఇంట్లో సంతోషంగా తిరుగుతూ, ఫోటోలకు పోజులిచ్చాయి. పెరట్లో ఆడుకున్నాయి. రెగీ ఇంట్లో సోఫాలో కలిసి విశ్రాంతి తీసుకున్నాయి.

ఈ మేరకు పెరల్ యజమాని వెనెస్సా సెమ్లర్ మాట్లాడుతూ పెరల్‌కు పెద్ద కుక్కలను కలవడానికి, వాటితో ఆడుకోవడానికి ఎటువంటి సమస్య లేదని అన్నారు. రెగీని కలవడానికి వెనెస్సా ఫ్లోరిడా నుండి పెరల్‌ని తీసుకువచ్చింది. పెరల్ కేవలం స్నేహశీలియైనది మాత్రమే కాదు, ఫ్యాషన్ కూడా. పెరల్ తాను ఒక చిన్న కుక్క అని కూడా గ్రహించదు. ఎప్పుడూ చలకిగా తిరుగుతూ పెద్ద కుక్కలతో ఆడుకుంటుందని చెప్పారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

పెరల్ రెగీని చూడగానే దాంతో స్నేహంగా మెలగటం మొదలుపెట్టింది. రెగీ యజమాని సామ్ జాన్సన్ రేస్ మాట్లాడుతూ, పెరల్ ఎలాంటి భయం, బెరుకు లేకుండా తిరగటం చూసి వారంతా ఆశ్చర్యపోయామని అన్నారు. ఈ ప్రత్యేకమైన సమావేశంతో ఆ రెండు కుక్కల యజమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…