డాబాపై ఆరేసిన మహిళల లో దుస్తులు మిస్సింగ్.. తెల్లారేసరికి ప్రత్యక్షం.. ఏంటా అని సీసీ టీవీ చూడగా..

బెంగళూరులో మహిళల లోదుస్తులు వరుసగా మాయమవుతున్న ఘటన వెనుక ఉన్న అసలు నిజం సీసీటీవీతో వెలుగులోకి వచ్చింది. డాబాపై ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలో ఓ యువకుడు పాత లోదుస్తులను తిరిగి ఉంచి, కొత్త జతను తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

డాబాపై ఆరేసిన మహిళల లో దుస్తులు మిస్సింగ్.. తెల్లారేసరికి ప్రత్యక్షం.. ఏంటా అని సీసీ టీవీ చూడగా..
Women's Laundry (Representative image )

Updated on: Jul 18, 2026 | 1:29 PM

బెంగళూరులో మహిళల లోదుస్తులు వరుసగా మాయమవుతున్న ఘటన వెనుక ఉన్న అసలు నిజం సీసీటీవీ కెమెరాతో బయటపడింది. హోయసళ నగర్‌లో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటనలో 23 ఏళ్ల అబ్దుల్ హుసైన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా ఇద్దరు మహిళలు ఉతికిన లోదుస్తులను ఇంటి డాబాపై ఆరబెట్టగా అవి రాత్రికి రాత్రే కనిపించకుండా పోతుండేవి. ఆశ్చర్యకరంగా, మరుసటి రోజు అవే లోదుస్తులు తిరిగి అదే చోట కనిపించేవి. అయితే మళ్లీ కొత్తగా ఆరబెట్టిన మరో జత లోదుస్తులు మాయమవుతుండటంతో మహిళలకు అనుమానం వచ్చింది. దీంతో డాబాపై రహస్యంగా సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. జూలై 2 తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో రికార్డైన దృశ్యాల్లో నిందితుడు డాబాపైకి ఎక్కి, గతంలో తీసుకెళ్లిన లోదుస్తులను తిరిగి ఉంచి, కొత్త జతను తీసుకుని వెళ్లినట్లు కనిపించింది.

సీసీటీవీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు అస్సాంకు చెందిన అబ్దుల్ హుసైన్. మహిళల లోదుస్తులను దొంగిలించి వాటిని ఒక రాత్రి ఉపయోగించిన తర్వాత మరుసటి రోజు తిరిగి ఉంచి, మరో కొత్త జతను తీసుకెళ్లే అలవాటు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

పోలీసులు ఇప్పటివరకు ఇలాంటి రెండు ఘటనలను నిర్ధారించారు. నిందితుడికి అసాధారణ మానసిక ఫెటిష్ ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని, ఇదే తరహాలో మరిన్ని ఘటనలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

(NOTE: నిందితుడు మానిసిక సమస్యలతో సతమతం అవుతున్నాడేమో అన్న అనుమానంతో అతని ఫోటో ప్రచురించడం లేదు)

 

 

Follow Us